స్టైల్ ఆఫ్ శ్రీరెడ్డి ‘కికి ఛాలెంజ్’ వీడియో
Spread the love

ప్రమాదకర ‘కికి ఛాలెంజ్’ యువతను ఊపేస్తున్న విషయం తెలిసిందే. పరుగెడుతున్న కారులోంచి దిగి పాటకు స్టెప్పులేయడం ఈ ఛాలెంజ్. కెనడాలో ప్రారంభమైన ఈ ‘వెర్రి కృత్యం’ సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచమంతా పాకింది. వినోదంతో పాటు ఒకింత సాహసం కూడా చేయాల్సి ఉండటంతో.. కికి తెగ కిక్కిస్తోంది. ఇంకేం.. పరుగెత్తే వాహనాల నుంచి దిగి కుప్పిగెంతులు వేస్తూ, ఆ వీడియోలను వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌‌ల ద్వారా షేర్ చేస్తున్నారు. దీంతో ఈ ఛాలెంజ్ తెగ వైరల్ అయింది. ఇదిలా ఉంటే.. కాస్టింగ్ కౌచ్ ద్వారా వార్తల్లోకెక్కిన నటి శ్రీరెడ్డి ఈ కికి ఛాలెంజ్‌ను మరోరకంగా వాడుకుంటోంది. వివాదాస్పద అంశాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ ప్రచారం కోసం పాకులాడే ఈ నటి తాజాగా కికి ఛాలెంజ్‌కు సంబంధించి ఓ వీడియోను పోస్టు చేసింది. హాట్ హాట్ స్టెప్పులతో ఆ వీడియో యువతకు మత్తెకించేలా ఉంది.

కికి ఛాలెంజ్‌పై పోలీసులు నిషేధం విధించినా లెక్క చేయని శ్రీరెడ్డి మరో వివాదానికి తెరతీసిందా అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. జాగ్రత్తగా గమనిస్తే ఆ వీడియోలో ఉంది శ్రీరెడ్డి మాత్రం కాదని తెలుస్తోంది. అచ్చూ తనలానే ఉన్న ఓ ఫారినర్ కికి వీడియోను శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. అయితే అది తాను వేసిన స్టెప్పులేనని ఆమె ఎక్కడా చెప్పుకోలేదు లెండి. శ్రీరెడ్డి పోస్టు చేసిన వీడియోను చూసి నెటిజన్లు తమకు తోచినవిధంగా కామెంట్లు గుప్పిస్తున్నారు. ‘ఇంత టాలెంట్ ఉందా’ అని కొందరు అంటే.. ‘ఆ వీడియోలో ఉన్న అమ్మాయి అచ్చూ నీలానే ఉందని పోస్టు చేశావ్ కదా’ అంటూ మరికొందరు కామెంట్ చేశారు. తన వీడియోకు తానే ‘సో సెక్సీ…’ అంటూ కామెంట్ కూడా ఇచ్చుకుందీ ఈ హాట్ నటి. ఏదేమైనా ఈ వీడియోతో శ్రీరెడ్డి నెట్టింట్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ అమ్మడికి కావాల్సింది కూడా అదేగా మరి!

Omg..so sexcyyyyy

Posted by Sri Reddy on Wednesday, August 8, 2018