ప్రియాంక చోప్రా  ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ !!
Spread the love

బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా – ప్రియుడు నిక్ జోనాస్ ప్రేమ పెళ్లి వ్యవహారం గత కొంతకాలంగా వేడెక్కిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. పెద్దలు కుదిర్చిన లవ్ మ్యారేజ్ ఇది అని చెప్పవచ్చు. ముంబైలో రోకా ఈవెంట్ – ఆ తర్వాత సంబరాల గురించి తెలిసిందే.ఇక గత కొంతకాలంగా పీసీ భూమ్మీద స్వర్గలోకాన్ని ఆస్వాధిస్తోంది. ముంబై టు లాస్ ఏంజెల్స్ ప్రయాణాలు – టాప్ క్లాస్ సిటీస్ లో సెలబ్రేషన్స్ తో ఒకటే బిజీగా ఉంది. డిసెంబర్ 1న పెళ్లి పీసీ- నిక్ జంట పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు. వివాహ వేడుకకు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇటీవలే నిక్ జోనాస్ బంధువులు – పీసీ తరపున బంధువులు వెన్యూని విజిట్ చేశారని ప్రచారమైంది. గత కొంత కాలంగా ప్రియాంక చోప్రా  అమెరికాలోనే ఉంటోంది. అక్కడ సఖుడు నిక్ జోనాస్ తో చిద్విలాసమైన జీవితాన్ని ఆస్వాధిస్తోంది. తాజా సమాచారం మేరకు.. పెళ్లికి చాలా ముందే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ ప్రీ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు – వీడియోల్ని పీసీ స్వయంగా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ముందుగా ప్రియాంక చోప్రా విదేశీ స్నేహితుల బృందం న్యూయార్క్ సిటీలోని టిఫానీ అండ్ కో బ్లూ ఫాక్స్ లో అదిరిపోయే పార్టీ ఇచ్చారు. దీనిని ప్రీవెడ్డింగ్ బ్రైడల్ షోవర్ అని చెబుతున్నారు. ప్రత్యేకించి పీసీ పెళ్లికూతురు గెటప్ ని రివీల్ చేశారు. వధువు గెటప్ కోసం అందాల పీసీకి ప్రత్యేకించి డిజైన్ చేసిన శ్వేతవర్ణం డిజైనర్ డ్రెస్ ఆకట్టుకుంది.

అయితే ఈ వేడుకలో వచ్చే అతిధుల జాబితా అంతా టాప్ క్లాస్ సెలబ్రిటీస్. పీసీతో పాటు టీవీ సిరీస్ లలో నటించిన తారలే. కెళ్లీ రిపా – లుపిట నోంగో – కెవిన్ జోనాస్ – డానియెల్లీ జోనాస్ తదితరులు ఉన్నారు. ప్రియాంక చోప్రా క్లోజ్ ఫ్రెండ్ ముబినా రోట్టోన్ సే – తన మేనేజర్ అంజులా ఆచారియా ఈ స్వయంగా ఈవెంట్ ని దగ్గరుండి నిర్వహించారట. ఈ పార్టీలో ప్రియాంక చోప్రా సినిమాల నుంచి కొన్ని పాటల రీమిక్స్ ని డీజేగా వినిపించారట. అంతేకాదు ఈవెంట్ కి విచ్చేసిన అతిధులందరికీ తలో షాంపైన్ బాటిల్ ని కానుకగా ఇచ్చి మరీ పంపించారట. “మై గర్ల్స్ ఇన్ టౌన్. ఎనీ రీజన్ టు పార్టీ.. ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్“ అంటూ కామెంట్ ని పోస్ట్ చేసింది పీసీ.