కోయంబత్తూరులో పట్టపగలే దారుణ హత్య …. వీడియో
Spread the love

తమిళనాడులోని కోయంబత్తూరులో పట్టపగలే దారుణ హత్య జరిగింది. తన ఇంటి నుంచి ప్రార్థనల కోసం మసీదుకు వెళ్తున్న 75 ఏళ్ల వ్యక్తిని మరో వ్యక్తి.. కిందపడేసి కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. ఈ దారుణ సంఘటన హత్యకు గురైన వ్యక్తి ఇంటికి కూత వేటు దూరంలో గురువారం నాడు మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఆస్తి వివాదాలతోనే జమీల్ అహ్మద్(75) అనే వృద్ధుడిని.. రిజ్వాన్ అనే వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అహ్మద్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రిజ్వాన్‌న్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు తెలిపారు.