క్రైమ్‌ థ్రిల్లర్‌.. ఆకట్టుకుంటోన్న ‘7’ ట్రైలర్‌
Spread the love

క్రైమ్‌ థ్రిల్లర్స్‌ ఎక్కువగా తమిళ, మలయాళంలో వస్తుండగా.. ప్రస్తుతం తెలుగులో కూడా వీటి హవా కొనసాగుతోంది. తాజాగా ‘7’ ట్రైలర్‌ను విడుదల చేశారు. మిస్టీరియస్‌గా ఉన్న ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. నువ్విలా ఫేమ్‌ హవీష్‌ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.

అమ్మాయిలు వరుసగా హత్యకు గురవటం, వాటికి కారణాలు ఏంటో తెలియకపోవడం, కార్తీక్‌ అనే కుర్రాడే ఈ హత్యలు చేశాడని పోలీసులు అనుమానించడం.. ఇలా ఈ కేసును చేదించడం.. ఈ క్రమంలో ఒకేలా ఇద్దరు ఉన్నారా? ఇలా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది. ఈ చిత్రంలో నందితా శ్వేతా, రెజీనా, రెహమాన్‌ కీలకపాత్రల్లో నటిస్తుండగా.. చేతన్‌ భరద్వాజ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. జూన్‌ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.