
ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 14 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కడప ఎస్పీగా ఉన్న అట్టాడ బాబూజీని విశాఖ రూరల్ ఎస్పీగా బదిలీ చేశారు. చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌ను గుంటూరు రూరల్ ఎస్పీగా, విశాఖ రూరల్ అడిషనల్ ఎస్పీ ఐశ్వర్య రాస్తోగిని నెల్లూరు ఎస్పీగా, విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీసీ ఫకీరప్పను కర్నూలు ఎస్పీగా, తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతిని కడప ఎస్పీగా, పార్వతీపురం ఓఎస్డీ విక్రాంత్ పాటిల్‌కు చిత్తూరు ఎస్పీగా బదిలీ అయింది. చిత్తూరు ఓఎస్డీ అన్బురాజన్‌కు తిరుపతి అర్బన్ ఎస్పీగా, విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మను విశాఖ సిట్‌కు, గుంటూరు రూరల్ ఎస్పీ వెంకట అప్పలనాయుడును విజయవాడ లా అండ్ ఆర్డర్‌కు, నెల్లూరు ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణను సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ బ్యూరోకు, కడప అడిషనల్ ఎస్పీ అద్మాన్ నయీం అస్మీకు విశాఖ లా అండ్ ఆర్డర్‌కు, కర్నూల్ ఎస్పీ గోపీనాథ్ జెట్టీని తితిదే సెక్యూరిటీ, విజిలెన్స్ బాధ్యతలు అప్పగించారు. నర్సీపట్నం ఓఎస్డీ సిద్ధార్థ కౌశల్‌కు గుంతకల్లు రైల్వే ఎస్పీగా బదిలీ చేశారు.