వాట్సాప్‌ స్టేటస్‌తో సంపాదన !!
Spread the love

ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్‌ దాదాపు గా ఒకటి కాదు.. రెండు కాదు.. పదేళ్లు! ప్రకటనలనేవి లేకుండా వాట్సాప్‌ నడిచిన కాలమిది! ఇకపై ఆ గ్యారెంటీ లేదు. ఎందుకంటారా? వాట్సాప్‌లోని స్టేటస్‌ సెక్షన్‌ను సంపాదనకు వాడుకోవాలని ఆ కంపెనీ నిర్ణయించింది! అదే అందులోనూ ప్రకటనల హోరు త్వరలోనే మొదలు కానుందని తెలుస్తోంది!

వెబ్‌సైటైనా.. మొబైల్‌ యాప్‌ అయినాసరే.. ప్రకటనలు తప్పనిసరన్నది తెలిసిన విషయం మన అందరకి తెలిసిందే.అయితే కాకపోతే చాటింగ్‌ యాప్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన వాట్సాప్‌ మాత్రం ఇందుకు భిన్నమనే చెప్పాలి. ఫేస్‌బుక్‌ చేతుల్లోకి వెళ్లిపోగానే ఉచిత సర్వీసులకు తెరపడుతుందని అనేక వదంతులొచ్చాయి. దాదాపు రూ.1.2 లక్షల కోట్లు పెట్టి కొనుక్కున్న ఈ ప్లాట్‌ఫాం నుంచి అంతకంత రాబట్టు కునేందుకు ఫేస్‌బుక్‌ రూపకర్త జుకర్‌బర్గ్‌ ప్రయత్నిస్తా రని అంతా అనుకున్నారు. అయితే ఈ వార్తలను ఫేస్‌బుక్‌ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. అయితే తాజాగా భారత్‌ పర్యటనలో ఉన్న వాట్సాప్‌ వైస్‌చైర్మన్‌ క్రిస్‌ డేనియల్స్‌ ఈ అనుమానాలకు తెరదించారు. భవిష్యత్తులో వాట్సాప్‌ స్టేటస్‌ను యాడ్‌లకు వాడుకుంటామని ప్రకటించారు. ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నది మాత్రం స్పష్టత లేదు.

‘అధిక లాభాల కోసం వినియోగదారుల వ్యక్తిగత గోప్యతను అమ్మేసుకున్నా. ఈ విషయంలో రాజీపడ్డాను. ప్రతిరోజూ ఈ విషయం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. టార్గెటెడ్‌ యాడ్స్‌ ద్వారా డబ్బు సంపాదించాలని ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌బర్గ్‌ ఎప్పుడో ప్రణాళిక సిద్ధం చేశాడు’.
– బ్రాయన్‌ యాక్టన్, వాట్సాప్‌ రూపకర్త

స్టేటస్‌లోనే ఎందుకు?
సాదారణంగా యాడ్‌ల కోసం వాడుకునేందుకు వాట్సాప్‌.. స్టేటస్‌నే ఎందుకు ఎన్నుకుంది.. అంటే చాటింగ్‌ విండోతో పాటు అనేక అవకాశాలు ఉన్నాయి కదా.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే స్టేటస్‌ ఫీచర్‌ గురించి ముందు తెలుసుకోవాలి. స్టేటస్‌ అప్‌డేట్‌ అనేది 24 గంటలు మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది. ఈ విషయం దాదాపు చాలా మందికే తెలుసు. ఉదయాన్నే ‘ఫీలింగ్‌ హ్యాపీ’అని స్టేటస్‌ పెట్టారనుకోండి. అలాగే సెల్ఫీ తీసుకుని పోస్ట్‌ చేశారనుకోండి.. సరిగ్గా 24 గంటల తర్వాత ఆ స్టేటస్‌ ఉండదు. మీ స్టేటస్‌తో పాటు వచ్చే యాడ్‌లు కూడా 24 గంటలే ఉంటాయన్న మాట. ఇంకోలా చెప్పాలంటే.. మీ అభిరుచులు, మీరున్న ప్రాంతం వంటి అనేక వివరాలను పరిగణనలోకి తీసుకుని మీకు తగిన ప్రకటనలను స్టేటస్‌ ఫీచర్‌లోకి కంపెనీ జొప్పిస్తుందన్నమాట! వ్యక్తిగత అభిరుచులకు తగ్గట్టు ప్రకటనలను వాల్‌పై పోస్ట్‌ చేసేందుకు ఫేస్‌బుక్‌లో ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌.. వాట్సాప్‌కు ఎలాగూ ఉపయోగ పడుతుందని అంచనా వేస్తున్నారు.