సోలార్ సాయంతో ఫోన్‌ చార్జ్ …
Spread the love

మొబైల్ స్మార్ట్‌ఫోన్ టాబ్లెట్ ల్యాప్‌టాప్, వీటిలో ఏ గాడ్జెట్ పనిచేయాలన్నా విద్యుత్ శక్తి చాలా అవసరం. ఛార్జింగ్ ఉన్నంత వరకు ఏ గాడ్జెట్ అయినా స్పందిస్తుంది. ఛార్జింగ్ అందుబాటులో లేని సమయాల్లో ప్రత్యామ్నాయ పద్ధతుల్లో గాడ్జెట్‌లకు శక్తిని సమకూర్చేందుకు పలు అంతర్జాతీయ కంపెనీలు సోలార్ ఛార్జర్లు రూపొందించాయి .

నిత్యం ఏదో ఒక గాడ్జెట్ మార్కెట్లో హల్‌చల్ చేస్తూ కుర్రకారు మది దోచేస్తున్నాయి. అలాంటి గాడ్జెట్ ఒకటి ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. స్మార్ట్ ఫోన్‌లు ఈ మధ్య ఎవరి చేతిలో చూసినా ఉంటుంది. దానికి తోడు చార్జింగ్ ఇబ్బందులు కూడా ఉంటాయి. అలాంటి వారి కోసమే ఈ చార్జర్. దీనిలో స్పెషల్ ఏంటంటే ఇది కేవలం సోలార్ సాయంతో చార్జ్ అవుతుంది. చిన్న రోల్‌గా ఉండే ఒక చిన్న పరికరంతో పేపర్‌సైజ్‌లో ఉండే సోలార్ ప్లేట్స్ దీనికి అమర్చబడి ఉంటుంది. దాంతో మీరు ఎక్కడకి వెళ్లినా జేబులో, బ్యాగులో పెట్టుకోవచ్చు. ఎండలో గంటసేపు ఉంచితే చాలు. ఈ గాడ్జెట్ బరువు 300 గ్రాములు ఉంటుంది. దృఢమైన బాడీ ఉండి ఎక్కడకి వెళ్లినా సౌకర్యంగా ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఈ మధ్యనే విడుదలయ్యింది.