మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ డివైస్‌లపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు
Spread the love

హైదరాబాద్‌ : ఇటీవలే ప్రారంభమైన మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ సాధనం ‘సర్ఫేస్ గో’ ను ప్రతీ ఒక్కరికి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఆఫ్‌లైన్‌లో కూడా అందుబాటులోకి తెచ్చినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ‘సర్ఫేస్ గో’ ఇప్పుడు క్రోమా, రిలయన్స్, విజయ్ సేల్స్, ఇండియాలోని ఇతర ఎంపిక చేసిన రిటైలర్ల వద్ద లభిస్తుందని పేర్కొంది. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ సాధనాలు కస్టమర్లకు ప్రీమియమ్ రీటైల్ స్టోర్లలో ఇఎమ్ఐ ఎంపికలలో లభించనున్నాయి. అధునాతన సర్ఫేస్‌ ప్రో 6, సర్ఫేస్ ల్యాప్ టాప్ 2 మరియు సర్ఫేస్‌ బుక్ 2 వంటి అత్యాధునిక సర్ఫేస్ సాధనాలకు వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో ఇండియాలోని తమ క్రెడిట్ కార్డు కస్టమర్లకు సిటిబ్యాంక్ వివిధ ఆఫర్లు అందించనున్నది. 30 జూన్ 2019 వరకు ఇండియా లోపల షిప్పింగు చేయబడే ఈ సర్ఫేస్ సాధనాల కొనుగోలుపై సిటిబ్యాంక్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది. సర్ఫేస్‌ బుక్‌2పై రూ. 7500, సర్ఫేస్‌ లాప్‌టాప్‌పై రూ. 5 వేలు, సర్ఫేస్‌ ప్రొపై 5 వేలు, సర్ఫేస్‌ గోపై రూ. 3వేల క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ అందించనుంది. స్టోర్ వివరాల కోసం Microsoft.com/en-in/retailers/surface చూడవచ్చు.

సర్ఫేస్ ల్యాప్ టాప్ 2
పరిపూర్ణ సమతుల్యత కలిగిన ఈ సరికొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్ 2 అద్భుతమైన పనితనాన్ని కలిగి ఉంటుంది. పలుచగా, తేలికగా ఉంటుంది. అధునాతన 8వ జనరేషన్ ఇంటెల్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. పాత వర్షన్‌ కంటె 85 శాతం ఎక్కువ శక్తివంతమైనది. 14.5 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. అత్యుత్తమ శ్రేణి కీబోర్డ్ మరియ ట్రాక్ ప్యాడ్లను కలిగి ఉంటుంది. పనిలో ఫ్లెక్సిబిలిటీ కోరుకునేవారు ఉపయోగించే ప్రత్యేకమైన ఈ డివైస్‌ సర్ఫేస్ బుక్ 2 నాలుగు వేరు వేరు మోడ్స్ – స్టుడియో మోడ్, ల్యాప్ టాప్ మోడ్, వ్యూ మోడ్, లేదా చివరికి టాబ్లెట్ మోడ్‌తో సహా, సింపుల్ గా స్క్రీన్ ని తొలగించటం ద్వారా సపోర్ట్ చేస్తుంది. 1.15 పౌండ్స్ బరువు, 8.3 మిమి సాంద్రత మరియు 10 అంగుళాలు నిడివి ఉన్న సర్పేస్ గో చాలా బ్యాగులలో చక్కగా ఇమిడిపోతుంది.

సర్పేస్ ప్రో 6
క్వాడ్-కోర్, 8వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ కలిగిన డివైస్ వైవిధ్యత, పోర్టబిలిటీ మరియు పవర్ కలిగి ఉన్న సాధనం. పాత వర్షన్‌ కంటే 1.5 రెట్లు వేగవంతమైనది. దీని బ్యాటరీ లైఫ్ రోజంతా ఉంటుంది. సర్ఫేస్ ప్రో 6 విశిష్టతలలో 12.3 పిక్సెల్ సెన్స్ టీఎం డిస్ప్లే ఒకటి.  విండోస్ 10 లో పాస్ వర్డ్-ఫ్రీ విండోస్ హలో సైన్-ఇన్ మరియు విండోస్ టైమ్ లైన్ వంటి సమయం ఆదా చేసే ఫీచర్లతో వినియోగదారులు తమ సర్పేస్ ప్రో 6 లో చాలా ప్రయోజనం పొందుతారు.