ఒక్క  రూపాయికే  స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌ టీవీ
Spread the love

స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌ టీవీ

ఏప్రిల్ 4 -6 దాకా ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్‌ సేల్‌

ఇందులో  మధ్యాహ్నం 2. గంటలకు రూ.1 ఫ్లాష్ సేల్

లేటెస్ట్‌ ఫోన్లు,  33 అంగుళాల ఎల్‌ఈడీ ఎంఐ  టీవీ

 న్యూఢిల్లీ :  చైనాకు చెందిన మొబైల్‌ దిగ్గజం  షావోమి ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్   (ఏప్రిల్4)నుంచి ప్రారంభం కానుంది.  ఏప్రిల్‌ 6వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్న ఈ సేల్‌లో ఎంఐ ఫ్యాన్స్‌కు పలు స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.  ముఖ్యంగాఈ సేల్‌లో భాగంగా   రూ.1 ఫ్లాష్‌ సేల్‌ను కూడా ప్రకటించింది.  దీనికి సంబంధించి  ఎంఐ ట్విటర్‌ ద్వారా  వీడియోలను కూడా పోస్ట్‌ చేస్తోంది.

ఒక రూపాయికే  తన లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌తోపాటు, ఎంఐటీవీని సొంతం చేసుకోవచ్చని ట్వీట్‌ చేసింది. ముఖ్యంగా రెడ్‌మి నోట్‌ 7 ప్రొ,  పోకో ఎఫ్‌ 1, ఎంఐ సౌండ్‌బార్‌,  ఎంఐ ఎల్‌ఈడీ4 ప్రొ(32) టీవీ ని ఒక రూపాయి ఫ్లాష్‌ సేల్‌లో విక్రయిస్తోంది. ఈ  ఫ్లాష్ సేల్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమౌతుంది. అంతేకాదు రూ. 2400 విలువైన ప్రొడక్ట్‌లను  కేవలం 99  రూపాయలకే అందిస్తోంది.

పోకో ఎఫ్1 (6 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్‌) రూ.1 సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది షావోమి.  దీని ధర రూ.22,999.  ఫ్లాష్‌ సేల్‌ అనంతరం ఈ స్మార్ట్‌ఫోన్‌పై  2వేల డిస్కౌంట్‌ లభ్యం. అలాగే ఎంఐ ఎల్‌ఈడీ4 ప్రొ(55) అంగుళాల టీవీని డిస్కౌంట్‌ అనంతరం  రూ.45,999 కు అందిస్తోంది.  మరిన్ని వివరాలు ఎంఐ వెబ్‌సైట్‌లో .