బ్యాంకులనే దోచేస్తున్న  అంతర్జాతీయ హ్యాకర్‌ !!!
Spread the love

బ్యాంకుల నుంచి ఈ మెయిల్‌ అకౌంట్లను హ్యాకింగ్‌ చేస్తూ నగదును తన ఖాతాలోకి మళ్లించే ప్రయత్నం చేసిన అంతర్జాతీయ హ్యాకర్‌ను వరంగల్‌ సైబర్‌ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌ గురువారం ప్రకటించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నైజీరియా దేశానికి చెందిన సైబర్‌ మోసగాడు మ్యాక్‌నెలన్‌ వరంగల్‌ కాశిబుగ్గలోని వరంగల్‌ అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు డబ్బులను సాంకేతిక పరిజ్ఞానంతో తన ఖాతాలోకి మళ్లించే ప్రయత్నం చేయబోయాడు.

దీంతో విషయాన్ని గుర్తించిన బ్యాంకు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. వరంగల్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు ఖాతాను హ్యాకింగ్‌ చేసి డబ్బులను కాజేయడానికి మ్యాక్‌నెల్సన్‌ వినియోగించిన మెయిల్‌ను కమిషనరేట్‌లో ఉన్న సైబర్‌ విభాగం అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హరియాణా రాష్ట్రం గురుగ్రామ్‌ ప్రాంతం నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించినట్లు సీపీ చెప్పారు.

దీంతో మడికొండ ఇన్‌స్పెక్టర్‌ సంతోష్‌ నేతృత్వలో ఎల్కతుర్తి ఎస్సై వీ ఎన్‌ సూరితో పా టు ప్రత్యేక దర్యాప్తు బృందం ఈనెల 14న నిందితుడిని గురుగ్రామ్‌లో అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. అతడి నుంచి ఒక ల్యాప్‌టాప్, వివిధ బ్యాంకులకు చెందిన నాలుగు డెబిట్‌ కార్డులు, నాలుగు పాస్‌పోర్టులు, మూడు సెల్‌ఫోన్లు, ఒక ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం నిందితుడిని గురుగ్రామ్‌ కోర్టులో హాజరుపరిచి ఈనెల 16న వరంగల్‌కు తీసుకువచ్చినట్లుచెప్పారు.

ఈ మేరకు మ్యాక్‌ నెల్సన్‌ను ఇంతేజార్‌గంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ కోర్టులో హాజరుపరచినచిట్లు పేర్కొన్నారు. అనంతరం కోర్టు అనుమతితో అతడిని అదుపులోకి తీసుకోని విచారించగా మహారాష్త్రకు చెందిన పలు కోఆపరేటివ్‌ బ్యాంకుల నుంచి తన ఖాతాలోకి డబ్బును మళ్లించినట్లు అంగీకరించాడన్నారు.

ఈ మెయిల్‌ అకౌంట్ల హ్యాకింగ్‌..

నిందితుడు మ్యాక్‌ నెల్సన్‌ వరంగల్‌ అర్బన్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకు, హైదరాబాద్‌కు చెందిన శ్యాంరావ్‌విటల్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకుల మధ్య లావాదేవిలకు సంబంధించిన అధికారిక ఈ మెయిల్‌ అకౌంట్లను హ్యాకింగ్‌ చేశాడన్నారు. దీంతో సంబంధిత బ్యాంకుల యూజర్‌ నేమ్‌తో పాస్‌వర్డ్‌లు సేకరించి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశాడన్నారు.

ఆర్‌టీజీఎస్‌ పత్రాలను ఆన్‌లైన్‌ ఫోర్జరీ చేసి బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులను తన ఖాతాలోకి మళ్లించే వాడన్నారు. గత నెల 18,20 తేదీలలో వరంగల్‌ అర్బన్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకు ద్వారా శ్యాంరావ్‌విటల్‌ కోఆపరేటివ్‌ బ్యాంకుకు రూ.35 లక్షలు, రూ.85 లక్షలు విలువైన చెక్కులను హ్యాకింగ్‌ పద్ధతిలో శ్యాంరావుకు పంపించాడు. దీనిని గమనించిన బ్యాంకు అధికారులు ఇంతేజార్‌గంజ్‌ పోలీసులకు సమాచారం అందించినట్లు ఆయన వివరించారు.

రూ.31 లక్షల రూపాయలు సీజ్‌…

మహారా్రçష్టకు చెందిన సింధుదుర్గ్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు ఈ మెయిల్‌ నుంచి హ్యాకింగ్‌ చేసిన సుమారు రూ.31 లక్షలను మ్యాక్‌ నెల్సన్‌ తన అధీనంలో ఉన్న ‘ఎస్‌’ ఢిల్లీ బ్యాంకు శాఖకు బది లీ చేసినట్లు అంగీకరించాడన్నారు. దీంతో ఢిల్లీ ‘ఎస్‌’ బ్యాంకులో అతడి సేవింగ్‌ అకౌంట్‌ను సీజ్‌ చేసినట్లు సీపీ పేర్కొన్నారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న నాలుగు పాస్‌పోర్ట్‌లలో రెండు నకిలీవని తేలడంతో పాస్‌పోర్ట్‌ శిక్ష్మాస్మృతి కింది అతడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

అధికారులకు సీపీ అభినందనలు..

కమిషనరేట్‌లో సైబర్‌ విభాగం ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే అంతర్జాతీయ హ్యాకర్‌ను అరెస్టు చేసిన అధికారులను పోలీసు కమిషనర్‌ రవీందర్‌ అభినందించారు. నిందితుడి అరెస్టు చేసిన సైబర్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ డి.విశ్వేశ్వర్, మడికొండ ఇన్‌స్పెక్టర్‌ సంతోష్, ఇంతేజార్‌గంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్, ఎల్కతుర్తి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ టీవీఆర్‌ సూరి, సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు.