విండీస్‌ ఆలౌట్‌‌
Spread the love

భారత్‌-వెస్టిండీస్‌ మధ్య రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో విండీస్ 311 పరుగులకు ఆలౌట్‌ అయింది. 295/7 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన విండీస్‌ ఎంతో సేపు క్రీజులో నిలవలేకపోయింది. కేవలం 16 పరుగులను మాత్రమే జోడించి మిగిలిన వికెట్లను కోల్పోయింది. నిన్నటి నుంచి భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన ఆల్‌రౌండర్‌ రోస్టన్‌ చేజ్‌ (106; 189 బంతుల్లో 8×4, 1×6) ఉమేశ్‌ యాదవ్‌ వేసిన బంతికి బౌల్డ్‌ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన గాబ్రియల్‌(0) కూడా ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లోనే పెవిలియన్‌ చేరాడు. అంతకుముందు 95.6 ఓవర్లో ఉమేశ్‌ వేసిన బంతికే దేవేంద్ర బిషూ(2) వెనుదిరిగాడు. దాంతో రెండో రోజు భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తుందని ఊహించిన విండీస్ ఆశలపై ఉమేశ్‌ నీళ్లు చల్లాడు. రెండో రోజు ఆటలో మిగిలిన 3 వికెట్లు అతనికే దక్కడం విశేషం.

లంచ్‌ విరామానంతరం చేజ్‌ ఎదురుదాడి సాగింది. ఫ్లాట్‌ ట్రాక్‌ను అర్థం చేసుకుంటూ ఎక్కువగా ఫ్రంట్‌ ఫుట్‌ షాట్లు ఆడుతూ పైచేయి సాధించాడు. స్పిన్‌ బౌలింగ్‌ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఒత్తిడి పెంచాడు. కాబట్టి మరో వైపు వికెట్ల పతనం సాగింది. హెట్‌మైర్‌, అంబ్రిస్‌ (18) పేలవ షాట్లకు వెనుదిరిగారు. ఈ దశలో డౌరిచ్‌తో కలిసి చేజ్‌ ఆరో వికెట్‌కు 69 పరుగులు జోడించాడు. 60వ ఓవర్‌లో ఉమేశ్‌ రివర్స్‌ స్వింగ్‌కు డౌరిచ్‌ ఎల్బీని అంపైర్‌ నాటౌట్‌గా తెలిపాడు. అయితే కోహ్లీ డీఆర్‌ఎ్‌సకు వెళ్లడంతో నిర్ణయం భారత్‌కు అనుకూలంగా వచ్చింది. 64వ ఓవర్‌లో చేజ్‌ 80 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: బ్రాత్‌వైట్‌ (ఎల్బీ) కుల్దీప్‌ యాదవ్‌ 14; కీరన్‌ పావెల్‌ (సి) రవీంద్ర జడేజా (బి) అశ్విన్‌ 22; షాయ్‌ హోప్‌ (ఎల్బీ) ఉమేశ్‌ యాదవ్‌ 36; హెట్‌మైర్‌ (ఎల్బీ) కుల్దీప్‌ యాదవ్‌ 12; సునిల్‌ అంబ్రిస్‌ (సి) రవీంద్ర జడేజా (బి) కుల్దీప్‌ యాదవ్‌ 18; రోస్టన్‌ చేజ్‌ (బ్యాటింగ్‌) 98; డౌరిచ్‌ (ఎల్బీ) ఉమేశ్‌ యాదవ్‌ 30; హోల్డర్‌ (సి) రిషభ్‌ పంత్‌ (బి) ఉమేశ్‌ యాదవ్‌ 52; దేవేంద్ర బిషూ (బ్యాటింగ్‌) 2; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 95 ఓవర్లలో 295/7. వికెట్ల పతనం: 1-32, 2-52, 3-86, 4-92, 5-113, 6-182, 7-286. బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 23-2-83-3; శార్దూల్‌ ఠాకూర్‌ 1.4-0-9-0; అశ్విన్‌ 24.2-7-49-1; కుల్దీప్‌ యాదవ్‌ 26-2-74-3; రవీంద్ర జడేజా 20-2-69-0.