వారు  ఆట ఆడటానికి వెళ్లారా లేక హనీమూన్‌కి వెళ్ళారా ?
Spread the love

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై అభిమానులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు భారత జట్టు ఆటగాళ్లు క్రికెట్ ఆడటానికి వెళ్లారా? లేక వారి భార్యలతో హనీమూన్ ట్రిప్ కి వెళ్ళారా అని మండిపడుతున్నారు. అయితే వారి కోపానికి బీసీసీఐ షేర్ చేసిన ఓ ఫొటోనే కారణం. మంగళవారం టీమిండియా ఆటగాళ్లు లండన్‌లో భారత హై కమిషన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంలో తీసిన భారత జట్టు ఫొటోనే బీసీసీఐ తమ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఆటగాళ్లు, సహాయ సిబ్బందితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య , బాలీవుడ్ కథానాయకి అనుష్కశర్మ కూడా ఉంది. మ్యాచింగ్ డ్రెస్ కోడ్‌తో హాజరైన ఆటగాళ్ల మధ్యలో అనుష్క భారత సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది . ఈ విషయమే అభిమానులకు తీవ్రమైన కోపాన్ని తెప్పించింది. టీమ్ అధికారిక మీట్‌కు అనుష్కశర్మ హాజరు కావడం ఏంటని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

‘భారత వైస్ కెప్టెన్ చివరలో నిలబడితే.. టీమిండియా ఫస్ట్ లేడీ మాత్రం ముందు నిలబడింది. వీళ్లే కొద్ది రోజుల క్రితం ఆన్లైన్ వేదికగా నీతి సూక్తులు బోధించారు’ అని ఒకరు సెటైర్ వేయగా.. ‘బీసీసీఐ అధికారిక టూర్‌కు కొందరి భార్యలను మాత్రమే ఎందుకు అనుమతించింది.. వారు ఆట ఆడటానికి వెళ్లారా లేక హనీమూన్‌కి వెళ్ళారా ?’ అని ఇంకొకరు ప్రశ్నించారు. అదొక టీమ్ ఈవెంట్ అని, ఫ్యామిలీ ఫంక్షన్ కాదు అని మరొకరు ఘాటుగా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక తొలి టెస్టులో ఓడిన కోహ్లిసేన రెండో టెస్టుకు రెడీ అయింది . గురువారం నుంచి లార్డ్స్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.