ఫలితం తేలని విశాఖ వన్డే
Spread the love

వన్డేల్లో 50 ఓవర్లలో 300 పరుగులు చేస్తే భారీ స్కోరు కిందే లెక్క. 300 పైచిలుకు విజయలక్ష్యాన్ని చాలా జట్లు అనేక సందర్భాల్లో చేధించినప్పటికీ తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు ఆ స్కోరు సాధిస్తే సగం విజయం సాధించేశామన్న ధీమాతో ఉంటాయి.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో విండీస్‌ కూడా 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 321 పరుగులే చేసింది. ఆఖరి ఓవర్లో 14 పరుగులు కావాల్సిన దశనుంచి ఐదు పరుగులు చేయాల్సిన స్థితిలో హోప్‌ బౌండరీనే కొట్టడంతో మ్యాచ్‌ టై అయింది. హెట్‌మయెర్‌ (64 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 94) సుడిగాలి ఇన్నింగ్స్‌కు షాయ్‌ హోప్‌ (134 బంతుల్లో 10 ఫోర్లు, 3 సికర్లతో 123 నాటౌట్‌) సంచలన బ్యాటింగ్‌కు తోడు హేమ్‌రాజ్‌ (24 బంతుల్లో 6 ఫోర్లతో 32) సత్తాచాటడడంతో విండీస్‌ పోరాడగలిగింది. కుల్దీప్‌ (3/67) మూడు వికెట్లు తీశాడు. విరాట్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. తదుపరి మ్యాచ్‌ శనివారం పుణెలో జరుగుతుంది.

10వేల పరుగుల విరాట్‌…

37వ ఓవర్లో నర్స్‌ బంతికి సింగిల్‌ తీసిన విరాట్‌ వన్డేల్లో 10వేల పరుగులు మైలురాయిని చేరుకున్నాడు. ధోనీ (20) మళ్లీ నిరాశపరిచాడు. 43వ ఓవర్లో పంత్‌ రెండు ఫోర్లు, కోహ్లీ ఇంకో ఫోర్‌ కొట్టి జోరు ప్రదర్శించారు. కానీ తదుపరి ఓవర్లోనే శామ్యూల్స్‌ బౌలింగ్‌లో పంత్‌ (17)ఎల్బీగా అవుటయ్యాడు. ఫీల్డ్‌అంపైర్‌ నిర్ణయంపై పంత్‌ సమీక్ష కోరినా.. నిర్ణయం అతడికి వ్యతిరేకంగా వచ్చింది.

స్కోరుబోర్డు

భారత్‌: రోహిత్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) రోచ్‌ 4, ధవన్‌ (ఎల్బీ) నర్స్‌ 29, కోహ్లీ (నాటౌట్‌) 157, రాయుడు (బి) నర్స్‌ 73, ధోనీ (బి) మెక్‌కోయ్‌ 20, పంత్‌ (ఎల్బీ) శ్యామ్యూల్స్‌ 17, జడేజా (సి) పొవెల్‌ (బి) మెక్‌కోయ్‌ 13, షమీ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 50 ఓవర్లలో 321/6, వికెట్లపతనం: 1/15, 2/40, 3/179, 4/222, 5/248, 6/307, బౌలింగ్‌: హోల్డర్‌ 6-0-50-0, రోచ్‌ 10-0-67-1, నర్స్‌ 10-0-46-2, బిషు 10-0-48-0, మెక్‌కోయ్‌ 9-0-71-2, శామ్యూల్స్‌ 5-0-36-1.

వెస్టిండీస్‌: పొవెల్‌ (సి) పంత్‌ (బి) షమి 18, హేమ్‌రాజ్‌ (బి) కుల్దీప్‌ 32, హోప్‌ (నాటౌట్‌) 123, శామ్యూల్స్‌ (బి) కుల్దీప్‌ 13, హెట్‌మయెర్‌ (సి) కోహ్లీ (బి) చాహల్‌ 94, పొవెల్‌ (సి) రోహిత్‌ (బి) కుల్దీప్‌ 18, హోల్డర్‌ (రనౌట్‌) 12, నర్స్‌ (సి) రాయుడు (బి) ఉమేష్‌ 5, రోచ్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 50 ఓవర్లలో 321/7, వికెట్లపతనం: 1/36, 2/64, 3/78, 4/221, 5/253, 6/300, 7/315, బౌలింగ్‌: షమీ 10-0-59-1, ఉమేష్‌ 10-0-78-1, కుల్దీప్‌ 10-0-67-3, జడేజా 10-0-49-0, చాహల్‌ 10-0-63-1.