వారిలో అదే దూకుడు ఉందన్న విరాట్‌ కోహ్లీ
Spread the love

విదేశీ పర్యటనలో తమకున్న పేలవ రికార్డును ఈసారి సరిచేసుకుంటామని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. అలాగే ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు బలహీనంగా ఏమీ లేదని, వారు దూకుడుగానే ఆడతారని భావిస్తున్నానన్నాడు. ‘చివరి నాలుగేళ్లలో మా ఆటగాళ్లు ఎంత అనుభవం సాధించారో.. ఎలాంటి ప్రదర్శన ఇచ్చామో గమనించాలి.

జట్టు అవసరాలను తీర్చడమే నా పని. అందు కోసం వంద శాతం కష్టపడతా. వివిధ దేశాల పర్యటన అలవాటుగా మారింది. ఇప్పుడు కొత్తగా ఏమనిపించడం లేదు. ఆస్ట్రేలియా గత పర్యటనతో పోలిస్తే.. ఇప్పుడు మేం బాగా అనుభవం గడించాం. జట్టు ఆడుతున్న తీరు చూస్తుంటే.. కచ్చితంగా సిరీస్ గెలవగలమనే నమ్మకం ఉన్నాది. అయితే.. కేవలం ఒకటి లేదా రెండు టెస్టులకే మా ఆధిపత్యాన్ని పరిమితం చేయదల్చుకోలేదు. సిరీస్ మొత్తం అదే జోరుని కొనసాగించాలని ఆశిస్తున్నాం. ఇక ఆస్ట్రేలియా టీమ్ గత పర్యటన తరహాలో పెద్ద ఎత్తున కవ్వింపులకి దిగకపోవచ్చు’ అని కోహ్లీ అన్నాడు. డిసెంబరు 6 నుంచి ఆసీస్‌తో మొదటి టెస్టు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.