భారత్, వెస్టిండీస్‌ మధ్య నేడు ఐదో వన్డే
Spread the love

భారత్‌ జోరైన ఆటతో ఏక పక్షంగా ప్రారంభమై… వెస్టిండీస్‌ పోరాటంతో అటుఇటు మలుపులు తిరిగిన వన్డే సిరీస్‌ తుది అంకానికి చేరింది. రెండు జట్ల మధ్య నాలుగో మ్యాచ్‌ మాత్రమే సాదాసీదాగా సాగింది. ముంబైలో సరైన కూర్పుతో బరిలో దిగి ప్రత్యర్థిని చుట్టేసింది టీమిండియా. సొంతగడ్డపై ఆరో ద్వైపాక్షిక సిరీ్‌సను నెగ్గాలనే పట్టుదలతో ఉన్నాది. అయితే, టెస్టుల్లో వార్‌ వన్‌సైడ్‌గా నడిచినా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం కరీబియన్లు ఆతిథ్య జట్టుకు చెమటలు పట్టిస్తున్నారు. నాలుగో వన్డేలో భారీ తేడాతో ఓడినా.. పుంజుకుని ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీ్‌సను 2-2తో సమం చేయాలని హోల్డర్‌ సేన భావిస్తోంది.  సిరీస్‌ నిర్ణాయక వన్డే కావడంతో మ్యాచ్‌ రసవత్తరంగా సాగే అవకాశం ఉన్నాది.

సొంతగడ్డపై తిరుగులేని ప్రదర్శన చేస్తున్న టీమిండియా.. మరో వన్డే సిరీ్‌సపై గురిపెట్టింది. వెస్టిండీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం నాడు జరిగే ఆఖరి మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. 2015లో దక్షిణాఫ్రికాపై సిరీస్‌ నుంచి స్వదేశంలో భారత జట్టు వన్డే సిరీస్‌ చేజార్చుకోలేదు. సిరీ్‌సలో 2-1 తో ముందంజలో ఉన్న భారత్‌కు విండీస్‌ అనూహ్యంగా గట్టిపోటీ ఇస్తోంది. నాలుగో వన్డే తప్పించి మిగిలిన మూడు మ్యాచుల్లో అంచనాలకు మించిన ప్రదర్శనే చేసింది.

30ఏళ్ల తర్వాత తిరువనంతపురం వన్డే మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఐతే మ్యాచ్‌ వేదిక గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో ఇదే మొదటి అంతర్జాతీయ వన్డే. ఇక్కడ ఇంతకుముందు ఒకే ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ (2017లో న్యూజిలాండ్‌తో టీ20) జరిగింది. గురువారం నాడు పిచ్‌ పొడిగా ఉంటుందని అంచనా. ‘‘బ్యాట్స్‌మెన్‌కు సహకరించే పిచ్‌ను తయారుచేశాం. 300పై స్కోరు నమోదవుతుందని అనుకుంటున్నాం’’ అని మ్యాచ్‌ కన్వీనర్‌ జయేష్‌ జార్జ్‌ చెప్పాడు. వర్షం వల్ల ఆటకు అంతరాయం కలగొచ్చు.

జట్లు (అంచనా)

భారత్‌: విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, ధవన్‌, అంబటి రాయుడు, ధోనీ, కేదార్‌ జాదవ్‌, జడేజా, భువనేశ్వర్‌, బుమ్రా, ఖలీద్‌ అహ్మద్‌, కుల్దీప్‌.

 వెస్టిండీస్‌: హోల్డర్‌ (కెప్టెన్‌), చంద్రపాల్‌ హేమ్‌రాజ్‌/సునీల్‌ ఆంబ్రిస్‌, కీరన్‌ పావెల్‌, షాయ్‌ హోప్‌, హెట్‌మయెర్‌, శామ్యూల్స్‌, రోవ్‌మన్‌ పావెల్‌, ఆష్లే నర్స్‌, కీమో పావెల్‌, దేవేంద్ర బిషు/ఫాబియాన్‌ అలెన్‌, కీమర్‌ రోచ్‌.