బ్రెజిల్‌- స్విట్జర్లాండ్‌ మ్యాచ్‌ డ్రా
Spread the love

ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఎక్కువ మంది అభిమానించే బ్రెజిల్‌ జట్టు ఈ ప్రస్తుత ప్రపంచకప్‌లో తన ఆరంభ మ్యాచ్‌లో నిరాశపర్చింది. మెగా టోర్నిలో శుభారంభం చేయడంలో విఫలం చెందింది. ఆదివారం జరిగిన గ్రూప్‌-ఈ మ్యాచ్‌ల్లో భాగంగా ఆదివారం జరిగిన బ్రెజిల్‌-స్విట్జర్లాండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో బలమైన బ్రెజిల్‌ను 1-1 గోల్స్‌తో స్విట్జర్లాండ్‌ సమర్థవంతంగా నిలువరించింది. 1978 తరువాత ప్రపంచకప్‌లో తన తొలి మ్యాచ్‌లో విజయంసాధించకపోవడం బ్రెజిల్‌కు ఇదే మొదటిసారి.
ఆదివారం మ్యాచ్‌లో నెయిమార్‌, అతని బృందానికి అనేక పెనాల్టీ అవకాశాలు లభించినా వాటిని గోల్స్‌గా మలచలేకపోయారు. స్విట్టర్లాండ్‌పై ఆధిక్యం కనిబరిచే అవకాశాలను బ్రెజిల్‌ ఆటగాళ్లు వృధా చేసుకున్నారు. సాంబా జట్టు మ్యాచ్‌ను నెమ్మదిగానే ఆరంభించినా క్రమంగా వేగం పెంచింది. ఫిలిప్‌ కౌటినో 20వ నిమిషంలో అద్భుతమై గోల్‌తో బ్రెజిల్‌కు ఆధిక్యాన్ని అందించాడు. బాక్స్‌ బయటి నుంచి అతడు కళ్లు చెదిరే కిక్‌తో స్విట్జర్లాండ్‌ గోల్‌కీపర్‌ యాన్‌ సోమర్‌ను బోల్తా కొట్టించాడు. వంపు తిరుగుతూ వెళ్లిన బంతి పై మూల నుంచి నెట్లో పడింది. దీంతో తొలి అర్థభాగం ముగిసే సరికి బ్రెజిల్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో అర్ధభాగంలో స్విట్లర్లాండ్‌ జట్టు పుంజుకుంది. ద్వీతీయార్థంలో స్విట్జర్లాండ్‌ ఆటతీరు ఆమెఘం. ఈ రెండో అర్థభాగంలో చక్కని వ్యూహాంతో స్విట్జర్లాండ్‌ ఆడింది. ముందుగా బ్రెజిల్‌ లయను దెబ్బ తీసి తరువాత ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలోనే 50వ నిమిషంలో స్టీవ్‌ జుబెర్‌ హెడర్‌ గోల్‌ సాధించాడు. బ్రెజిల్‌ డిఫెన్స్‌ వైఫల్యం జుబెర్‌కు కలిసొచ్చింది. షాకిరి కార్నర్‌ను కొట్టగా.. జుబెర్‌ను డిఫెండర్లు ఒంటరిగా వదిలేశారు. అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. దీంతో స్విట్జర్లాండ్‌ 1-1తో స్కోరు సమం చేసింది. తర్వాత రెండు జట్లూ గట్టిగా ప్రయత్నించినా మరో గోల్‌ కొట్టలేకపోయాయి. బ్రెజిల్‌ ఆటగాళ్ల ఎదురుదాడులను స్విట్జర్లాండ్‌ సమర్థవంతంగా నియంత్రిస్తూ మరోవైపు తన రక్షణవలయాన్ని కాపాడుకుంది. చివరికి మ్యాచ్‌ను డ్రా ముగించింది. బ్రెజిల్‌ స్టార్‌ ఆటగాడు నెయిమార్‌, సబ్యిట్టూడ్‌ ఆటగాడు రోబెర్టో ఫిర్మినో చేసిన దాడులను స్విస్‌ గోల్‌కీపర్‌ యాన్‌ సోమర్‌ సమవర్థవంతంగా నిలువరించాడు. నెయిమార్‌ ఒక్క గోల్‌ కూడా చేయకపోవడంతో అభిమానులు నిరాశచెందారు.