ఈ టైమ్ లో  కూడా  టెన్నిస్ పట్టిన సానియా  వైరల్  !!!
Spread the love

మళ్లీ టెన్నిస్ రాకెట్ పట్టిన   ఇండియన్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా, అయితే  ఇక ఇంతకుముందు ఆడినట్లుగానే బలమైన షాట్లు కొడుతూ….తన ఆటలో కసి తగ్గలేదని తెలియజేసింది  ఇక ప్రస్తుతం ఏడు నెలల ప్రెగ్నెంట్ గా ఉన్న సానియా మీర్జా ….రాకెట్ పట్టడం ఏంటి అని ఆశ్చర్యానికి గురి అవుతున్నారా ? అయితే సానియా మీర్జా ఏదో ఇంటర్నేషనల్ ఆడలేదులేండి….. అయితే ఇక  తన ఇంటి మైదానంలో రాకెట్ పట్టి….తన సోదరినే ప్రత్యర్థిగా చేసి సానియా మీర్జా ఓ పట్టు పట్టింది . రెండు రోజుల క్రితం తన సోదరి ఆనమ్ మీర్జాతో కలిసి టెన్నిస్ ఆడేటటువంటి చరవాణిని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో సానియా షేర్ చేసింది. ప్రెగ్నెంట్ గా ఉండి కూడా ఆటపై ఇష్టంతో రాకెట్ పట్టిందన్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది .

ప్రెగ్నెంట్ అయిన తాను కొన్ని రోజులుగా ఆటకు దూరంగా ఉంటోన్నవిషయం తెలిసిందే. అయితే ప్రెగ్నెంట్ గా ఉన్నా….ఆటపై ఇష్టం చావని సానియా….సరదాగా తన సోదరి ఆనమ్ తో కలిసి టెన్నిస్ ఆడింది. ఆ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఎంత ప్రయత్నం చేసిన టెన్నిస్ కు దూరంగా ఉండలేకపోతున్నానని క్యాప్షన్ పెట్టింది. టెన్నిస్ క్రీడాకారుల నుంచి కోర్టును దూరం చేయగలరు కావచ్చు కానీ – ఆటను దూరం చేయలేరు కదా అని పోస్ట్ చేసింది. ఈ వీడియోపై సానియా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. 7 నెలల గర్భిణి అయినా….సానియా ఆట అదరగొట్టేసిందని వారు కితాబిస్తున్నారు. ఆటకు తాత్కాలిక విరామం ఇచ్చినా ఛాంపియన్ ఎప్పటికైనా ఛాంపియనే అని కామెంట్లు చేస్తున్నారు .