ఐపీఎల్‌: ఆర్సీబీ అరుదైన ఘనత
Spread the love

ఇండోర్‌ : ఐపీఎల్‌లో రాయల్‌చాలెంజర్స్‌ బెంగళూరు అరుదైన రికార్డును నమోదు చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌పంజాబ్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ.. 10 వికెట్ల తేడాతో గెలుపొంది ఈసీజన్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఓ అద్భుతాన్ని సృష్టించింది.  అంతేగాకుండా ఇలా వికెట్‌ నష్టపోకుండా 10 వికెట్ల తేడాతో గెలవడం బెంగళూరుకు ఇది మూడో సారి కాగా.. ఏ జట్టు కూడా ఇలా ఒకసారికి మించి గెలవలేకపోవడం విశేషం. 2010 సీజన్‌లో తొలి సారి రాజస్తాన్‌ రాయల్స్‌తో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల లక్ష్యాన్ని వికెట్‌ నష్టపోకుండా ఛేదించిన ఆర్సీబీ.. 2015లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌పై 96 పరుగుల లక్ష్యాన్ని మరోసారి ఛేదించింది. ఇక తాజాగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా అధిగమించి ఐపీఎల్‌ చరిత్రల్లో మూడు సార్లు ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు స్పష్టించింది.

2018 సీజన్‌లో ఓ జట్టు పది వికెట్ల తేడాతో గెలుపొందడం ఇదే తొలిసారి. బ్యాట్స్‌మెన్‌ తప్ప తాము ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నామన్న అపప్రథను బెంగళూరు బౌలర్లు తిప్పికొట్టారు. పేసర్లు, స్పిన్నర్లు సమష్టిగా రాణించి పంజాబ్‌ను దెబ్బకొట్టారు. ముఖ్యమైన మ్యాచ్‌లో జట్టుకు అంతకంటే కీలక విజయం అందించారు. పంజాబ్ బ్యాట్స్‌మెన్ వరుసగా అవుట్ అయిపోవడం, 89పరుగుల టార్గెట్‌ను 8.1ఓవర్లలోనే చేధించడం బెంగళూరు జట్టుకు బాగా కలిసొచ్చిన అంశాలు. దీంతో బెంగళూరు పంజాబ్‌పై 10 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో దాదాపు అన్ని మ్యాచ్‌లలోనూ సిక్సర్లు, బౌండరీలతో మెరిపించి, మురిపించిన పంజాబ్ వికెట్ కీపర్ ఎల్.కే.రాహుల్ పరుగులు తీయలేకపోయాడు. విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ కూడా అతి తక్కువ పరుగులకే పెవిలియన్ దారిపట్టగా, అరోన్ పింఛ్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌లెవరూ సింగిల్ డిజిట్‌ను దాటలేకపోయారు. కింగ్స్‌లెవెన్‌ను 15.1 ఓవర్లలోనే 88 పరుగులకు పరిమితం చేసింది. ముగ్గురు ఆటగాళ్లు రనౌట్‌ కావడం గమనార్హం. పంజాబ్‌ జట్టులో ఆరోన్‌ ఫించ్‌ (23 బంతుల్లో ఫోర్‌, 2 సిక్సర్లతో 26) టాప్‌ స్కోరర్‌ కాగా రాహుల్‌ (15 బంతుల్లో 3 సిక్సర్లతో 21), గేల్‌ (14 బంతుల్లో 4 ఫోర్లతో 18) ఓ మోస్తరుగా రాణించారు. ఫలితంగా ఈ జట్టు 88 పరుగులకే ఆలౌటైంది.

పంజాబ్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) గ్రాండ్‌హోమ్‌ (బి) ఉమేశ్‌ 21; గేల్‌ (సి) సిరాజ్‌ (బి) ఉమేశ్‌ 18; నాయర్‌ (సి) కోహ్లి (బి) సిరాజ్‌ 1; ఫించ్‌ (సి) కోహ్లి (బి) అలీ 26; స్టాయినిస్‌ (బి) చాహల్‌ 2; మయాంక్‌ (సి) పార్థివ్‌ (బి) గ్రాండ్‌హోమ్‌ 2; అక్షర్‌ పటేల్‌ నాటౌట్‌ 9; అశ్విన్‌ రనౌట్‌ 0; ఆండ్రూ టై (సి) పార్థివ్‌ (బి) ఉమేశ్‌ 0; మోహిత్‌శర్మ రనౌట్‌ 3; రాజ్‌పుత్‌ రనౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (15.1 ఓవర్లలో ఆలౌట్‌) 88;

వికెట్ల పతనం: 1-36, 2-41, 3-41, 4-50, 5-61, 6-78, 7-78, 8-79, 9-84;

బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 4-0-23-3; సౌథీ 2-0-19-0;; మహ్మద్‌ సిరాజ్‌ 3-0-17-1; చాహల్‌ 2-0-6-1; గ్రాండ్‌హోమ్‌ 2-0-8-1; మొయిన్‌ అలీ 2.1-0-13-1

బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి నాటౌట్‌ 48; పార్థివ్‌ పటేల్‌ నాటౌట్‌ 40; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (8.1 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా) 92;

బౌలింగ్‌: అశ్విన్‌ 1-0-9-0; ఆండ్రూ టై 4-0-33-0; రాజ్‌పుత్‌ 1.1-0-21-0; మోహిత్‌శర్మ 1-0-15-0; స్టాయినిస్‌ 1-0-12-0.