అద్భుతం… ఒకే ఓవర్‌లో 43 పరుగులు!
Spread the love

ఒకే ఓవర్‌లో 43 పరుగులా? ఇది నమ్మలేని నిజం. ఒకే ఒక్క ఓవర్‌లో 43పరుగులు సాధించడమనేది మామూలు విషయం కాదు. మన లెక్క ప్రకారం.. 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టినా 36 పరుగులే వస్తాయి. కానీ, ఇక్కడ 43 పరుగులు ఎలా వచ్చేశాయి అంటారా..? మీరడిగేది పాయింటే కానీ ఆ ఓవర్‌లో రెండు నోబాల్స్‌ పడితే అవి సిక్సర్లైతే.. ఇది సాధ్యం కాదంటారా! అవును న్యూజిలాండ్‌ దేశవాళి వన్డేలో ఇదే జరిగింది. న్యూజిలాండ్‌ దేశవాళీ వన్డే టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం నార్త్‌న్‌ డిస్ట్రిక్‌, సెంట్రల్‌ డిస్ట్రిక్‌ మధ్య వన్డే మ్యాచ్‌ జరిగింది. సెంట్రల్‌ బౌలర్‌ విలియం బౌలింగ్‌లో.. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్లు జో కార్టర్‌, బ్రీట్‌ హమ్‌ప్టన్‌ వరుస బంతుల్లో 4, 6+నోబాల్‌, 6+నోబాల్‌, 6, 1, 6, 6, 6.. మొత్తంగా 43పరుగులు రాబట్టి లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించారు. దీంతో ఒక ఓవర్‌లో అత్యధిక (43) పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్‌గా లుడిక్‌ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ దెబ్బకు 10 ఓవర్లు వేసిన లుడిక్‌ మొత్తం 85 పరుగులు సమర్పించుకున్నాడు.