తొండాట ఆడిన పొలార్డ్… నెటిజన్ల ఫైర్…
Spread the love

భారత్ కు వెస్టిండీస్ కు మధ్య జరిగిన రెండో టీ-20 మ్యాచ్ లో బ్యాట్స్ మన్ పొలార్డ్ ఆడిన ఆటతీరు ఇప్పుడు తీవ్ర విమర్శలపాలైంది.అందుకు కారణం గాల్లోకి క్యాచ్ లేపిన పొలార్డ్, ఆపై దాన్ని అందుకునేందుకు వచ్చిన భారత బౌలర్ బుమ్రాను అడ్డుకునేందుకు ప్రయత్నించడమే..

బుమ్రా వేసిన 11వ ఓవర్లో 4వ బంతిని పోలార్డ్ ఆడగా..అది గాల్లోకి లేచింది.దాన్ని అందుకునేందుకు బుమ్రా వెళ్లగా, అతని రెండు చేతుల మధ్య నుంచి పోలార్డ్ తన చేతిని పోనిచ్చాడు.అప్పటికీ బుమ్రా బంతిని ఒడుపుగా పట్టుకుని పొలార్డ్ వైపు ఆగ్రహంగా చూడగా..పొలార్డ్ నవ్వుతూ పెవీలియన్ కు వెళ్లాడు.ఆయన తొండాట ఆడాడని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ ఓడిపోగా.. 3 మ్యాచ్ ల సిరీస్ ను ఇప్పటికే 2-0తో భారత్ గెలుచుకుందన్న సంగతి తెలిసిందే.