పంజాబ్‌పై ముంబయి ఘనవిజయం
Spread the love

ఐపీఎల్‌లో ఏడు మ్యాచ్‌లు ఓడితే ప్లేఆఫ్‌ అవకాశాలకు దాదాపుగా తెరపడ్డట్లే. ఈ సీజన్లో ఆరు మ్యాచ్‌లు ఓడిన ముంబయి మెడపై ఇప్పటికే కత్తి వేలాడుతోంది. ఒక్క మ్యాచ్‌ ఓడినా ప్లేఆఫ్‌ రేసుకు దాదాపు దూరమైనట్లే. ఈ స్థితిలో ఆ జట్టు పట్టుదల ప్రదర్శించింది. శుక్రవారం మొహాలిలో జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను ఓడించింది. తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆ జట్టుకిది మూడో విజయం. ఎనిమిదో మ్యాచ్‌ ఆడిన పంజాబ్‌ మూడో ఓటమి చవిచూసింది.

ఇండోర్‌: ముంబయి ఇండియన్స్‌ సరైన సమయంలో సత్తా చాటింది. పంజాబ్‌పై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కింగ్స్‌ విసిరిన 175 పరుగుల లక్ష్యాన్ని ముంబై 19.0 ఓవర్లలో ఛేదించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (57; 42 బంతుల్లో 6×4, 3×6), కృనాల్‌ పాండ్య (31 నాటౌట్‌; 12 బంతుల్లో 4×4, 2×6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన కింగ్స్‌ పంజాబ్‌ తొలి వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత కేఎల్‌ రాహుల్‌(24) వికెట్‌ను కోల్పోయింది. అయితే గేల్‌ హాఫ్‌ సెంచరీ సాధించి స్కోరు బోర్డును చక్కదిద్దాడు. 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్థ శతకం సాధించిన తర్వాత గేల్‌ పెవిలియన్‌ చేరాడు.

Mumbai Indians beat Kings Punjab

దాంతో కింగ్స్‌ పంజాబ్‌ 84 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. ఆ తర్వాత కాసేపటికి యువరాజ్‌ సింగ్‌(14) మూడో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక కరుణ్‌ నాయర్‌(23) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోవడంతో కింగ్స్‌ పంజాబ్‌ 134 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను కోల్పోయింది. చివర్లో మయాంక్‌ అగర్వాల్‌(11),అక్షర్‌ పటేల్‌(13)లు నిరాశపరచగా, స్టోయినిస్‌(29 నాటౌట్‌;15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్‌ ఝుళిపించాడు. దాంతో కింగ్స్‌ పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.

బౌలర్ల ప్రతిభతో రెండు జట్ల ఇన్నింగ్స్‌ 8 పరుగుల రన్‌రేట్‌తోనే సాగింది. అటు, ఇటు మొదటి, చివరి స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన ఆటగాళ్లే కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. విజయానికి సమఉజ్జీలుగా ఉన్న దశలో పేలవ బౌలింగ్‌ పంజాబ్‌ కొంపముంచగా… మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన కృనాల్‌ పాండ్యా ముంబైకి విజయం అందించి సంతోషంలో ముంచెత్తాడు.

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) డుమిని (బి) మార్కండే 24; గేల్‌ (సి) సూర్యకుమార్‌ (బి) కటింగ్‌ 50; యువరాజ్‌ రనౌట్‌ 14; కరుణ్‌ (సి) హార్దిక్‌ (బి) మెక్లెనగన్‌ 23; అక్షర్‌ పటేల్‌ (సి) హార్దిక్‌ (బి) బుమ్రా 13; స్టాయినిస్‌ నాటౌట్‌ 29; మయాంక్‌ అగర్వాల్‌ (సి) కృనాల్‌ (బి) హార్దిక్‌ 11; అశ్విన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 174;

వికెట్ల పతనం: 1-54, 2-88, 3-96, 4-132, 5-135, 6-164

బౌలింగ్‌: మెక్లెనగన్‌ 4-0-31-1; బుమ్రా 4-0-19-1; హార్దిక్‌ పాండ్య 4-0-44-1; మయాంక్‌ మార్కండే 3-0-29-1; డుమిని 1-0-8-0; కటింగ్‌ 3-0-28-1; కృనాల్‌ పాండ్య 1-0-10-0

ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: సూర్యకుమార్‌ (సి) రాహుల్‌ (బి) స్టాయినిస్‌ 57; లూయిస్‌ (సి) రాహుల్‌ (బి) ముజీబ్‌ 10; ఇషాన్‌ కిషన్‌ (బి) ముజీబ్‌ 25; హార్దిక్‌ (బి) టై 23; రోహిత్‌ నాటౌట్‌ 24; కృనాల్‌ నాటౌట్‌ 31; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (19 ఓవర్లలో 4 వికెట్లకు) 176

వికెట్ల పతనం: 1-38, 2-80, 3-100, 4-120

బౌలింగ్‌: అశ్విన్‌ 4-0-23-0; రాజ్‌పుత్‌ 3-0-31-0; ఆండ్రూ టై 4-0-35-1; ముజీబ్‌ 4-0-37-2; అక్షర్‌ 1-0-9-0; స్టాయినిస్‌ 3-0-37-1