ప్లేఆఫ్ ఆశలు సజీవం చేసుకున్న ముంబై
Spread the love

ముంబై: ఐపీఎల్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌కు అదృష్టం మళ్లీ కలిసొచ్చింది. ఓటమికి చేరువగా వచ్చి కూడా ఆ జట్టు సొంతగడ్డపై విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 3 పరుగుల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను ఓడించింది. 10 ఓవర్లకు ముంబయి స్కోరు 79/4. మ్యాచ్‌లో ఆ జట్టు పనైపోయినట్లే. ప్లేఆఫ్‌ ఆశలకు తెరపడ్డట్లే అనుకున్నారంతా! కానీ ఆ జట్టు పుంజుకుని ప్రత్యర్థికి 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.తర్వాత 16 ఓవర్లకు పంజాబ్‌ స్కోరు 145/1. మళ్లీ అందరూ ముంబయి పనైపోయిందనే అనుకున్నారంతా. కానీ ముంబయి బౌలింగ్‌లోనూ పుంజుకుంది. చివరి ఓవర్లలో బుమ్రా (3/15) ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టిపడేశాడు. ముంబయి మ్యాచ్‌ సొంతం చేసుకుని ప్లేఆఫ్‌ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది.

ముంబయికిది ఆరో విజయం. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి, మిగతా సమీకరణాలూ కలిసొస్తే ఆ జట్టు ముందంజ వేయొచ్చు. మరోవైపు చివరి ఆరు మ్యాచ్‌ల్లో ఐదు ఓడిన పంజాబ్‌.. ప్లేఆఫ్‌ రేసులో మరింత వెనుకబడింది. మొత్తంగా ఆ జట్టుకిది ఏడో ఓటమి. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ గెలిస్తే ముంబయి కథ ముగిసేది. పంజాబ్‌ ఓడినా.. ఆ జట్టు అవకాశాలకు తెరపడలేదు. మిగిలిన రెండు ప్లేఆఫ్‌ బెర్తుల కోసం ఇప్పటికీ ఐదు జట్లు రేసులో ఉండటం విశేషం.

Mumbai Indians beat Kings eleven Punjab 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్‌ పంజాబ్‌ ఓపెనర్లు ఇన్నింగ్స్‌ను దాటిగా ఆరంభించారు. అయితే క్రిస్‌ గేల్‌ (18: 11బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) నిరాశ పరచగా.. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఈ సీజన్‌లో దూకుడు మీదున్న రాహుల్‌ క్రీజులోకి వచ్చిన ఫించ్‌తో దాటిగా ఆడాడు. ఈ క్రమంలో 36 బంతుల్లో  4 ఫోర్లు,1 సిక్స్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఫించ్‌ సైతం దాటిగా ఆడాడు. దీంతో పంజాబ్‌ 12.1 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసింది. బుమ్రా వేసిన 17 ఓవర్‌లో ఫించ్‌(46: 35 బంతులు, 3 ఫోర్లు,1 సిక్స్‌) భారీ షాట్‌కు ప్రయత్నించి తృటిలో హాఫ్‌ సెంచరీ చేజార్చుకున్నాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 111 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన స్టోయినిస్‌ (1) తీవ్రంగా నిరాశపరిచాడు.

గత మూడు మ్యాచ్‌ల పరాజయాల నుంచి పాఠం నేర్చుకున్న పంజాబ్‌ తప్పక గెలవాల్సిన పోటీలో పట్టుదల ప్రదర్శించింది. తొలుత ఆండ్రూ టై (4/16) అమోఘ బౌలింగ్‌తో ప్రత్యర్థిని రెండు వందల పరుగులలోపే కట్టడి చేసిన కింగ్స్‌ లెవెన్‌.. అంతకుముందు టాస్‌ కోల్పోయి మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 186/8 స్కోరు చేసింది. పొలార్డ్‌ (23 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50), క్రునాల్‌ పాండ్యా (32), సూర్యకుమార్‌ యాదవ్‌ (27) మాత్రమే రాణించారు. టై 16 పరుగులకు 4 వికెట్లు పడగొట్టగా అశ్విన్‌ 18 పరుగులకు రెండు వికెట్లు తీశాడు. బుమ్రాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

కేఎల్‌ రాహుల్‌ 19వ ఓవర్‌లో ఔట్‌ కావడంతో కింగ్స​ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు ఓటమి పాలైంది. దీంతో రాహుల్‌ కంటతడి పెట్టుకున్నారు కూడా. మ్యాచ్‌ ముగిసిన తర్వాత రాహుల్‌ వద్దకు వెళ్లిన ముంబై ఇండియన్స్‌ ఆటగాడు హర్ధిక్‌ పాండ్యా తన జెర్సీని తీసి రాహుల్‌కు ఇచ్చి స్పోర్ట్స్‌మ్యాన్‌ స్పిరిట్‌ను చాటుకున్నారు. అందుకు ప్రతిగా రాహుల్‌ కూడా పంజాబ్‌ జెర్సీని హర్ధిక్‌కు అందజేశారు. 94 పరుగుల వద్ద రాహుల్‌ను బుమ్రా అద్భుతమైన బాల్‌తో ఔట్‌ చేశారు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆటగాళ్లు లక్ష్యాన్ని చేధించలేకపోవడంతో 3 పరుగుల తేడాతో ముంబై గెలిచి ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది.