మెరీనా బీచ్ లో ఇసుక గూళ్లు కడుతున్న ధోనీ…
Spread the love

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా పాల్గొంటుంటే, ఇండియాలోనే ఉండి సేదదీరుతూ, మరో పది రోజుల తరువాత వన్డేలు, టీ-20ల్లో ఆడేందుకు వెళ్లనున్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రస్తుతం తన కుటుంబంతో సహా చెన్నై వచ్చిన ధోనీ, కుమార్తె జీవాతో కలిసి మెరీనా బీచ్ కి వెళ్లాడు.

అక్కడ ఇసుకలో గూళ్లు కట్టాడు.గుంత తీసి, తన కుమార్తెను అందులోకి దింపి, గూడు కట్టాడు.ఆ ఫోటోలు ఇప్పుడు నేట్టింట్లో వైరల్ అవుతున్నాయి.మార్చి, ఏప్రిల్లో జరుగబోయే ఐపీఎల్ పోటీల్లో ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తాడన్న సంగతి తెలిసిందే.మేనేజ్ మెంట్ తో ఏర్పాట్లు,ఆటగాళ్లకు శిక్షణ తదితర అంశాలపై చర్చించేందుకే ధోనీ చెన్నైకి వచ్చినట్టు తెలుస్తోంది.