జీవాతో డాన్స్ అదరగొట్టిన ధోనీ..
Spread the love

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కుమార్తె జీవాకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. జీవా సోషల్ మీడియా సెలెబ్రిటీ. ధోనీతో జీవా చేసిన డ్యాన్సు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ధోనీ తన కూతురు జీవాకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు. ఈ వీడియోలో ధోనికి జీవా డాన్స్ మాష్టార్ అవతారం ఎత్తడం విశేషం. జీవా డాన్స్ స్టెప్పులేసి చూపిస్తుంటే.. ధోనీ ఆమెను అనుకరించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసి ధోనీ అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని బ్యాట్‌ను కాస్త పక్కనబెట్టి రాకెట్‌ పట్టాడు. క్రికెట్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించిన ధోనీ.. టెన్నిస్‌లోనూ సత్తా చాటాడు.