చెన్నైపై రాజస్థాన్ విజయం, ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
Spread the love

జైపూర్: ప్లే ఆఫ్స్ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. జైపూర్ వేదికగా శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరో విజయం సాధిస్తే దాదాపు ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టే స్థితిలో చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఇంకో ఓటమి చవిచూస్తే దాదాపు ప్లేఆఫ్స్‌పై ఆశలు వదులుకునే స్థితిలో రాజస్థాన్‌. వీటి పోరులో పరిస్థితులు చాలావరకు చెన్నైకే అనుకూలించినా..  రాజస్థాన్‌ పోరాటం ఆపలేదు. పట్టు వదల్లేదు. ముఖ్యంగా సూపర్‌ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (95 నాటౌట్‌; 60 బంతుల్లో 11×4, 2×6) మరోసారి గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. తన జట్టుకు అత్యావశ్యక విజయాన్నందించాడు. 11 మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌కిది ఐదో విజయం కాగా.. అన్నే మ్యాచ్‌లు ఆడిన చెన్నై నాలుగో ఓటమి చవిచూసింది.

ఐపీఎల్‌-11లో కాస్త ఆలస్యంగా పుంజుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌.. వరుసగా రెండో విజయం సాధించింది. శుక్రవారం చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో నెగ్గింది. 177 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్‌ 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదట చెన్నై 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. సురేశ్‌ రైనా (52; 35 బంతుల్లో 6×4, 1×6) టాప్‌స్కోరర్‌.

IPL 2018 Rajasthan Royals Beat Chennai Super Kings

ఛేదనలో సహచర బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేసినా బట్లర్‌ అద్భుతంగా పోరాడాడు. ఓపెనర్‌గా దిగి.. చివరిదాకా క్రీజులో నిలిచి జట్టును గెలిపించాకే మైదానాన్ని వీడాడు. (60 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు.. 95 పరుగులు) ఆడి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఐపీఎల్‌ కెరీర్‌ మొత్తంలో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్‌అని, భార్య చూస్తుండగా గెలుపొందడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు.  నమ్మకాన్ని నిలబెట్టా: బేసిగ్గా నేను మిడిలార్డర్‌లో వచ్చేవాడిని. ఇప్పుడు ఓపెనర్‌ పాత్రను బాగా ఎంజాయ్‌ చేస్తున్నా. బ్యాటింగ్‌ ఆర్డర్లో నన్ను పైకి పంపాలన్న నిర్ణయం కోచ్‌ షేన్‌ వార్న్‌దే. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నా. చెన్నైపై ఆడటం అంతసులువేమీకాదు. చివరిదాకా నిలబడి, జట్టును గెలిపించడం ఆనందంగా ఉంది. ఇది(60 బంతుల్లో 95) నా బెస్ట్‌ ఇన్నింగ్స్‌’’ అని బట్లర్‌ చెప్పాడు. ఆమె ముందుర..: ‘‘ప్రస్తుతం నా భర్య ఇండియాలోనే ఉంది. అత్తమామలు, కజిన్‌ కూడా తనతో మ్యాచ్‌ చూడటానికి వచ్చారు. ఆమె ముందర బెస్ట్‌ ఇన్నింగ్స​ ఆడటం, గెలవడం మర్చిపోలేని అనుభూతి. ప్రపంచంలోనే బెస్ట్‌ టోర్నీ ఐపీఎల్‌. ఇక్కడ నేర్చుకోవడానికి ఎంతో దొరుకుతుంది..’’ అని పేర్కొన్నాడు.

ధోనీ:  తప్పంతా బౌలర్లదేనని మండిపడ్డాడు కెప్టెన్‌ కూల్‌ ఎంఎస్‌ ధోనీ. బౌలింగ్‌కు సంబంధించి పక్కాగా వ్యూహాలు రచించినా, అమలు చేయడంలో బౌలర్లు విఫలమయ్యారని, అందుకే ఓడిపోవాల్సి వచ్చిందని అన్నాడు.  ఒకటి చెబితే.. ఇంకోటి చేశారు: ‘‘ఖచ్చితంగా బౌలర్ల వల్లే ఓడిపోయాం. పర్టికులర్‌ లెన్త్‌లో బౌలింగ్‌ చేస్తే ఫలితం దక్కేది. కానీ అలా జరగలేదు. ఫలానా ఏరియాలోనే బంతులు విసరాలని చెబితే మా వాళ్లు ఇంకోటి చేశారు. వ్యూహాన్ని అమలు చేయడంలో దారుణంగా విఫలమయ్యాం. నిజానికి ఇది(176) డిఫెండబుల్‌ స్కోరే. విజయాన్ని మా నుంచి దూరం చేసింది బౌలర్లే’’ అని ధోనీ అన్నాడు.  ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ రేసులో ఆశలను సజీవంగా ఉంచుకుంది.