ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఘన విజయం
Spread the love

న్యూఢిల్లీ:  శ్రేయస్‌ అయ్యర్‌ గతంలోనే ఐపీఎల్‌లో తనదైన ముద్ర వేశాడు. ఈ సీజన్లోనూ బాగానే ఆడుతున్నాడు. కానీ శుక్రవారం నాటి అతడి ఇన్నింగ్స్‌ మాత్రం అసాధారణం. గంభీర్‌ స్థానంలో దిల్లీ డేర్‌డెవిల్స్‌ పగ్గాలందుకున్న ఈ కుర్రాడు అనూహ్యంగా చెలరేగిపోయాడు. కోల్‌కతా బౌలర్లపై ఉప్పెనలా పడ్డాడు. ఏకంగా 10 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 40 బంతుల్లోనే 93 పరుగులు చేశాడు. అందులో చివరి 50 పరుగులు చేయడానికి తీసుకున్న బంతులు 13 మాత్రమే. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ముందు 220 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన ఆ జట్టు.. 55 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఘనవిజయం సాధించింది. ఏడు మ్యాచ్‌ల్లో ఢిల్లీకిది రెండో విజయం మాత్రమే.

ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఎట్టకేలకు మళ్లీ ఘన విజయం పై గెలుపు బాట పట్టింది. కెప్టెన్సీని విజయంతో ప్రారంభించడం గొప్పగా అనిపిస్తోందని 23 ఏళ్ల శ్రేయస్స్‌ అయ్యార్‌ ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ అనంతరం అతను మాట్లాడుతూ ‘ఇది గొప్పగా అనిపిస్తోంది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌ళో విజయం సాధించడం అద్భుతంగా ఉంది’ అని అన్నాడు. ‘టాస్‌ గెలిస్తే.. మొదట బౌలింగ్‌ తీసుకుందామని అనుకున్నాం. కానీ, టాస్‌ ఓడటం కూడా మంచిదే అయింది’ అని తెలిపాడు. టాస్‌ ఓడి.. బ్యాటింగ్‌ తీసుకున్నప్పటికీ ఢిల్లీకి పృథ్వీ షా-కొలిన్‌ మన్రో జోడీ మంచి శుభారంభాన్నిచ్చింది. ముఖ్యంగా 44 బంతుల్లో 62 పరుగులు చేసిన కుర్రాడు పృథ్వీషాపై శ్రేయస్‌ ప్రశంసల జల్లు కురిపించాడు.

పృథ్వీ ఢిల్లీకి మంచి ఆరంభాన్ని ఇచ్చాడని, ఈ సీజన్‌ ప్రారంభమైన నాటినుంచి అతను బాగా ఆడుతూ.. జట్టుకు అవసరమైన శుభారంభాలను ఇస్తున్నాడని ప్రశంసించాడు. 18 సంవత్సరాల 169 రోజుల వయస్సున పృథ్వీ షా.. ఐపీఎల్‌ అర్ధ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సంజూ సామ్‌సన్‌తో కలిసి రికార్డు పంచుకుంటున్నాడు. అలాగే మన్రో, ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌  లియాం ప్లంకెట్‌పైనా శ్రేయస్‌ ప్రశంసల జల్లు కురిపించాడు.

 IPL 2018: Delhi Daredevils beat Kolkata Knight Riders by 55 runs

యస్‌ అయ్యర్‌ మిగతా బ్యాటింగ్‌ అంతా ఒకెత్తయితే.. చివరి ఓవర్లో సాగించిన విధ్వంసం మరో ఎత్తు. ఏ బంతి వేసినా బాదేట్లు కనిపించిన అయ్యర్‌.. మావిపై అసాధారణ రీతిలో విరుచుకుపడ్డాడు. ఏకంగా నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌ బాదాడు. తొలి బంతికి లాంగాఫ్‌ దిశగా సిక్సర్‌ బాదిన అయ్యర్‌.. కాళ్ల మీద పడ్డ రెండో బంతిని మిడ్‌వికెట్‌ దిశగా స్టాండ్స్‌లోకి తరలించిన తీరు అమోఘం. తక్కువ వేగంతో వికెట్‌కు కాస్త దూరంగా పడ్డ మూడో బంతిని సరిగా ఆడలేకపోయాడు. అవతలి ఎండ్‌లో మాక్స్‌వెల్‌ రనౌటైపోయాడు. ఇక నాలుగో బంతి షార్ట్‌ లెంగ్త్‌లో పడగా దాన్ని పుల్‌ షాట్‌తో అలవోకగా సిక్సర్‌గా మళ్లించాడు. ఐదో బంతికి సునాయాసంగా లాంగాఫ్‌లో ఫోర్‌ కొట్టిన అయ్యర్‌.. చివరి బంతిని అదే దిశలో గాల్లోకి లేపాడు. అది స్టాండ్స్‌లో తేలింది. ఈ ఓవర్లో ఒక వైడ్‌ కూడా కలిపి మొత్తం 29 పరుగులొచ్చాయి. మావి మూడో ఓవర్లోనూ అయ్యర్‌ 2 సిక్సర్లు బాదాడు. తొలి 2 ఓవర్లలో మావి 11 పరుగులే ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. అయ్యర్‌.. మావి బౌలింగ్‌లో కొట్టిన తొలి షాట్‌కే ఔటవ్వాల్సింది. దాన్ని ఉతప్ప అందుకోకపోవడంతో సిక్సర్‌కు వెళ్లింది. ఆ క్యాచ్‌ అందుకుని ఉంటే కథే వేరుగా ఉండేదేమో.

* ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో కెప్టెన్సీ చేపట్టిన ఆటగాళ్లలో శ్రేయస్‌    అయ్యర్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. శుక్రవారం కోల్‌కతాతో మ్యాచ్‌లో ఢిల్లీ   పగ్గాలు  చేపట్టిన అయ్యర్‌ వయసు 23 ఏళ్ల 142 రోజులు. కోహ్లి (2011లో 22 ఏళ్ల   187 రోజులకు), రైనా (2010లో 23 ఏళ్ల 112 రోజులకు), స్టీవెన్‌ స్మిత్‌ (2012లో   23 ఏళ్ల 112 రోజులకు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

* పవర్‌ ప్లేలో ఢిల్లీ స్కోరు. ఈ సీజన్లో తొలి 6 ఓవర్లలో ఆ జట్టుకు ఇదే అత్యుత్తమం.

* ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌లో 10 సిక్సర్లు బాదిన తొలి కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యరే. అంతే కాదు   ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడూ అతనే.