తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 215/2
Spread the love

రికార్డుల రారాజు టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ టెస్టు కెరీర్‌లో మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఒక ఏడాది కాలంలో విదేశీ గడ్డపై ఎక్కువ పరుగులు సాధించిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు టీమిండియా మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పేరుమీద ఉన్నాది. 2002లో విదేశీ గడ్డపై ద్రవిడ్‌ 1137 పరుగులు చేశాడు. అనంతరం దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఆసీస్‌తో జరుగుతున్న టెస్టుల్లో కోహ్లీ 1138 పరుగులు చేశాడు. ద్రవిడ్‌ కంటే ముందు 1983లో మొహీందర్‌ అమర్‌నాథ్‌ 1065 పరుగులు చేయగా.. 1971లో సునీల్ గావస్కర్‌ 918 పరుగులు చేశారు. 2010 తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ గడ్డపై సుదీర్ఘమైన ఓపెనింగ్ (బంతుల పరంగా) స్టాండ్ ఇదే కావడం గమనార్హం. గతంలో సెహ్వాగ్-గంభీర్ 29.3 ఓవర్లు ఆడారు. ఇక అవకాశం వచ్చినప్పుడల్లా కంగారూ పేసర్లు షార్ప్ బౌన్స్‌తో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌పై అటాకింగ్ చేసినా.. పుజార, మయాంక్ వికెట్‌ను కాపాడుకుని లంచ్ వరకు 57/1 స్కోరు చేశారు.

స్కోరు బోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్: విహారి (సి) ఫించ్ (బి) కమిన్స్ 8, మయాంక్ (సి) పైనీ (బి) కమిన్స్ 76, పుజార బ్యాటింగ్ 68, కోహ్లీ బ్యాటింగ్ 47, ఎక్స్‌ట్రాలు: 16, మొత్తం: 89 ఓవర్లలో 215/2.వికెట్లపతనం: 1-40, 2-123. బౌలింగ్: స్టార్క్ 16-6-32-0, హాజిల్‌వుడ్ 18-6-45-0, లియోన్ 21-4-59-0, కమిన్స్ 19-6-40-2, మార్ష్ 15-3-23-0.