రిటైర్మెంట్ ప్రకటించిన “గౌతమ్ గంభీర్”
Spread the love

భాతర సీనియర్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ కాబోతున్నట్లు ప్రకటించాడు.తన రిటైర్మెంట్ విషయాన్ని ఒక వీడియో పోస్ట్ ద్వారా వెల్లడించాడు.క్రికెట్ లో గత 15 సంవత్సరాల నుంచి భారతదేశానికి సేవలందించానని ఇక క్రికెట్ కు వీడ్కోలు పలకనున్నానని తెలిపాడు.

కొంతకాలంగా చాలా మంది తన ప్రదర్శనని అవహేళన చేశారని..తను ఔటై డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్తున్నప్పుడు విన్న కామెంట్లు మనసును కలిచివేశాయని ఆ వీడియోలో బాధపడ్డాడు.పరోక్షంగా ఆ అవమానాలు భరించలేకే తన రిటైర్మెంట్ పై నిర్ణయం తీసుకున్నానని అన్నాడు.ఈ సందర్భంగా ఆయన తన కెరీర్ లో సాధించిన ఘనతలను ఈ వీడియో ద్వారా గుర్తుచేసుకున్నాడు.ఇంతకాలం తనను ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన గౌతమ్ గంభీర్, కోల్ కతా అభిమానులకు ప్రత్యేకంగా తన కృతఙ్ఞతలు తెలిపాడు.

అయితే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో ఢిల్లీ-ఆంధ్రా జట్ల మధ్య గురువారం జరిగే మ్యాచ్ గౌతమ్ గంభీర్ కు చివరి మ్యాచ్ అని తెలుస్తోంది.14 ఏప్రిల్ 2003 న టీమ్ ఇండియాలో గౌతమ్ గంభీర్ ప్రవేశించాడు.తన 15 సంవత్సరాల క్రికెట్ కెరీర్ లో 58 టెస్టులు,147 వన్డేలు, 37 టీ20లు గంభీర్ ఆడాడు.

Announcement #Unbeaten

The most difficult decisions are often taken with the heaviest of hearts. And with one heavy heart, I’ve decided to make an announcement that I’ve dreaded all my life. Indian Cricket Team#Unbeaten

Posted by Gautam Gambhir on Tuesday, December 4, 2018