ఢిల్లీ కుర్రాళ్లు అదరగొట్టారు, ముంబై శకం ముగిసింది
Spread the love

హైదరాబాద్: ఐపీఎల్‌ సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ పోరాటం లీగ్‌ దశలోనే ముగిసింది. ఆదివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 11 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో గెలవడమేగాక, భారీ రన్‌రేట్‌ను కూడా సంపాదించాల్సిన స్థితిలో తీవ్రమైన ఒత్తిడికి లోనైన ముంబయి 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమై, మరో మూడు బంతులు మిగిలి ఉండగా, 163 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా మొత్తం 14 మ్యాచ్‌ల్లో ఎనిమిదో పరాజయాన్ని చవిచూసిన రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి కేవలం 12 పాయింట్లకు పరిమితమై, ప్లే ఆఫ్ దశకు చేరుకోకుండానే వెనుదిరిగింది. ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌ రేసు నుంచి వైదొలిగిన తొలి జట్టు ఢిల్లీ కాగా, తాజాగా ముంబై ఇండియన్స్‌ ముంచేసింది.

175 పరుగుల లక్ష్యంతో బరిలోదిగిన ముంబై 19.3 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్‌లో ఢిల్లీ పైచేయి సాధించింది. ఫలితంగా మరోసారి ప్లేఆఫ్‌కు చేరాలన్న ముంబై ఇండియన్స్‌ లక్ష్యం నెరవేరలేదు. లూయిస్‌ (31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 48), కటింగ్‌ (20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37), హార్దిక్‌ (17 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 27) మాత్రమే పోరాడారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అమిత్‌ మిశ్రా (3/19), హర్షల్‌ పటేల్‌ (3/28), లామిచానె (3/36) . ఆఖరి వికెట్‌గా బూమ్రా ఔట్‌ కావడంతో ముంబై 19.3 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ బౌలర్లలో లామ్‌చెన్‌, అమిత్‌ మిశ్రా, హర్షల్‌ పటేల్‌లు తలో మూడేసి వికెట్లతో సత్తాచాటగా, ట్రెంట్‌ బౌల్ట్‌ వికెట్‌ దక్కింది.

Delhi Daredevils knock Mumbai Indians out

టాస్‌ నెగ్గిన ఢిల్లీ మొదట బ్యాటింగ్‌కే మొగ్గుచూపింది. ఓపెనింగ్‌ వైఫల్యంతో 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. పృథ్వీ షా (12) రనౌట్‌కాగా, మ్యాక్స్‌వెల్‌ (18 బంతుల్లో 22; 4 ఫోర్లు)ను బుమ్రా బౌల్డ్‌ చేశాడు. ఈ దశలో కెప్టెన్‌ శ్రేయస్‌తో కలిసి రిషభ్‌ పంత్‌ ఢిల్లీ ఇన్నింగ్స్‌ను నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ ఈ జోడీ కూడా విఫలమైంది. కెప్టెన్‌ అయ్యర్‌ (6) మార్కండే బౌలింగ్‌లో నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన విజయ్‌ శంకర్‌తో పంత్‌ డేర్‌డెవిల్స్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. 13వ ఓవర్లో జట్టు 100 పరుగులు దాటింది. ఈ క్రమంలోనే రిషభ్‌ పంత్‌ 34 బంతుల్లో (4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. పదో ఓవర్‌ తర్వాత బుమ్రా, కటింగ్, హార్దిక్‌ పాండ్యాలు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో స్కోరు వేగం మందగించింది. ముస్తఫిజుర్‌ వేసిన 15వ ఓవర్లో పంత్‌ సిక్సర్, శంకర్‌ ఫోర్‌ కొట్టి టచ్‌లోకి వచ్చారు. హార్దిక్‌ తర్వాతి ఓవర్లో పంత్‌ మరో రెండు సిక్సర్లు బాదేశాడు. జోరు పెరిగిన దశలో రిషభ్‌ ఇన్నింగ్స్‌కు కృనాల్‌ పాండ్యా తెరదించాడు. దీంతో 64 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత అభిషేక్‌ జతగా విజయ్‌ శంకర్‌ పోరాడే లక్ష్యాన్ని ముంబై ముందుంచగలిగాడు.

స్కోరు వివరాలు

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా రనౌట్‌ 12; మ్యాక్స్‌వెల్‌ (బి) బుమ్రా 22; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) కృనాల్‌ (బి) మార్కండే 6; రిషభ్‌ పంత్‌ (సి) పొలార్డ్‌ (బి) కృనాల్‌ 64; విజయ్‌ శంకర్‌ నాటౌట్‌ 43; అభిషేక్‌ శర్మ నాటౌట్‌ 15; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 174.

వికెట్ల పతనం: 1–30, 2–38, 3–75, 4–139.

బౌలింగ్‌: కృనాల్‌ 2–0–11–1, బుమ్రా 4–0– 29–1, హార్దిక్‌ 4–0–36–0, ముస్తఫిజుర్‌ 4–0–34–0, మార్కండే 2–0–21–1, కటింగ్‌ 4–0–36–0.

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: సూర్యకుమార్‌ (సి) శంకర్‌ (బి) లమిచానే 12; లూయిస్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) మిశ్రా 48; ఇషాన్‌ కిషన్‌ (సి)  శంకర్‌ (బి) మిశ్రా 5; పొలార్డ్‌ (సి) బౌల్ట్‌ (బి) లమిచానే 7; రోహిత్‌ (సి) బౌల్ట్‌ (బి) హర్షల్‌ 13; కృనాల్‌ (సి) సబ్‌–తేవటియా (బి) లమిచానే 4; హార్దిక్‌ (సి) సబ్‌–తేవటియా (బి) మిశ్రా 27; కటింగ్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) హర్షల్‌ 37; మార్కండే (బి) బౌల్ట్‌ 3; బుమ్రా (సి) బౌల్ట్‌ (బి) హర్షల్‌ 0; ముస్తఫిజుర్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్‌) 163.

వికెట్ల పతనం: 1–12, 2–57, 3–74, 4–74, 5–78, 6–121, 7–122, 8–157, 9–163, 10–163.

బౌలింగ్‌: లమిచానే 4–0–36–3, బౌల్ట్‌ 4–0–33–1, మ్యాక్స్‌వెల్‌ 2–0–19–0, హర్షల్‌ 2.3–0–28–3, ప్లంకెట్‌ 3–0–27–0, మిశ్రా 4–0–19–3.