వైరల్ అవుతున్న’విరుష్క’..ఫొటోలు
Spread the love

ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో తొలి టీ20లో ఘన విజయం సాధించిన తరువాత భారత క్రికెట్ జట్టు కార్డిఫ్ చేరుకుంది. తొలి టీ20లో శుభారంభం చేసిన భార‌త్ 1-0తో సిరీస్‌లో ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య శుక్రవారం రెండో టీ20 ఇక్కడి సోఫియా గార్డెన్స్‌లో జరగనుంది.

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు జట్టు బస్సులో అనుష్క  ప్రయాణిస్తోన్న ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన భర్త కోహ్లీ తో పాటు బస్సులో కూర్చున్న అనుష్క ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బస్సులోంచి మొదట అనుష్కశర్మ దిగగా.. తరువాత కోహ్లీ దిగాడు. కొన్ని రోజుల ముందు కోహ్లీ ఇంగ్లండ్‌ పర్యటనకు బయలుదేరే ముందు అనుష్క ముంబయి ఎయిర్‌పోర్టుకి వచ్చి విరాట్ కు వీడ్కోలు పలికింది. దీంతో అనుష్క ఇంగ్లాండ్‌ రాకపోవచ్చేమో అని అనుకున్నారంతా. అయితే అనూహ్యాంగా అనుష్క ఇంగ్లాండ్‌లో కనిపించడంతో అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఇప్పుడు అనుష్క ఒక్కసారిగా కోహ్లీతో కలిసి బస్సులో ప్రత్యక్షమయింది.

కోహ్లీ పక్కనే అనుష్క కూర్చోవడం, వీళ్లిద్దరూ బస్సు నుంచి దిగి హోటల్‌కు వెళ్లేముందు తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తొలి టీ20 జరుగుతున్నప్పుడు స్టేడియంలో, హోటల్‌లో అనుష్క కనిపించలేదు. సిరీస్‌లో విరాట్‌తో పాటు టీమిండియాకు మద్దతుగా నిలవడంతో పాటు వారిని ఉత్సాహపరిచేందుకు ఇక్కడికి వచ్చింది. కార్డిఫ్ చేరుకోగానే స్థానికంగా నివాసం ఉంటున్న భారతీయులు, అభిమానులతో ఆమె ఫొటోలు కూడా దిగింది.