‘2019 ప్రపంచకప్‌లో విజేత ఇంగ్లాండ్‌కే ఛాన్స్‌లెక్కువ..’
Spread the love

హైదరాబాద్: ఇంగ్లాండ్ జట్టు గత కొద్దినెలలుగా వన్డేలు ఆడుతున్న తీరు చూస్తుంటే.. వచ్చే ఏడాది ప్రపంచకప్‌లో ఆ జట్టే విజేతగా నిలిచేలా కనిపిస్తోందని దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ అలెన్ డొనాల్డ్ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ అలెన్ డొనాల్డ్ వచ్చే సంవత్సరం జరగనున్న వరల్డ్ కప్ టోర్నీ గురించి మాట్లాడాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలుస్తుందటూ నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. 2019 ప్రపంచకప్‌కు సొంతగడ్డపైనే ప్రత్యర్థులతో తలపడనుండటంతో.. జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపాడు. తమ దేశ జట్టు గురించి తెలిపిన డొనాల్డొ దక్షిణాఫ్రికా జట్టుకు వరల్డ్ కప్ ఆశలు ఒకింత తగ్గుముఖం పట్టాయి. ఏబీ డివిలియర్స్ రిటైర్‌మెంట్ నిర్ణయంతో ప్రపంచకప్ గెలుస్తుందనే నమ్మకాలు లేవని వెల్లడించాడు. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ ఇంగ్లాండ్ జట్టు 125 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తర్వాత వరుసగా భారత్ (122), దక్షిణాఫ్రికా (113) ఉన్నాయి.

‘ఇంగ్లాండ్‌కి ప్రపంచకప్‌ గెలిచే ఛాన్స్‌లు ఏవైనా ఉన్నాయంటే.. అది కచ్చితంగా 2019లోనే. కొద్దినెలలుగా ఇయాన్ మోర్గాన్‌ కెప్టెన్సీలో ఆ జట్టు చాలా దూకుడుగా ఆడుతోంది. గతంలో నేను చూసిన ఇంగ్లాండ్‌ కంటే పూర్తి భిన్నంగా ఇప్పుడు ఆ జట్టు వన్డేల్లో రాణిస్తోంది. ఇక దక్షిణాఫ్రికా అంటారా..? సఫారీ జట్టు ప్రతిసారి ప్రపంచకప్‌‌కి చాలా చేరువగా వెళ్తోంది. వచ్చే ఏడాది కూడా దక్షిణాఫ్రికా జట్టు కప్ గెలవలేదు అని చెప్పను. కానీ.. ఏబీ డివిలియర్స్‌ రిటైర్మెంట్ జట్టు అవకాశాల్ని దెబ్బతీసింది’ అని డొనాల్డ్ వెల్లడించాడు.

ఈ క్రమంలో దక్షిణాఫ్రికా కప్ గెలుచుకోకుండా నిరుత్సాహపరుస్తుందని కాదు. డివిలియర్స్ లేమితో పోరాడే జట్టు.. టోర్నీలో చివర వరకూ వెళ్లగలుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తపరిచాడు. యేటా వరల్డ్ కప్ పోటీలో దక్షిణాఫ్రికానే అందరి కంటే మంచి ప్రదర్శన ఇచ్చేదని తమ జట్టును గుర్తు చేసుకున్నాడు. వచ్చే ఏడాది మే 30న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే.