కంటతడి పెట్టిన జూనియర్ ఎన్టీఆర్..?
Spread the love

టాలీవుడ్ ఇండస్ట్రీలో అభిమానులను ప్రేమించే వారిలో ముందుంటాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ముఖ్యంగా నందమూరి వంశంలో అభిమానులను తన కుటుంబ సభ్యులుగా తీసుకునే హీరోల్లో ప్రప్రథముడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంత మూలంగానే తన ప్రతి ఆడియో ఫంక్షన్ లో నే మరియు ప్రీ రిలీజ్ వేడుకల్లోనూ కార్యక్రమానికి హాజరైన ప్రతి అభిమాని జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని మీరు ఇంటికి వెళ్లకపోతే మీ కుటుంబ సభ్యులతో పాటు నేను కూడా ఎంతగానో బాధపడతా అంటూ అభిమానులకు కొన్ని జాగ్రత్తలు చెబుతారు తారక్.

 

ఇంతగా అభిమానులను ప్రేమించే తారక్ తన అభిమాని కృష్ణా జిల్లా వాస్తవ్యులు జయదేవ్ అనే అభిమాని చనిపోవడంతో తీవ్ర నిరాశకు భావోద్వేగానికి గురై ఫేస్ బుక్ వేదికగా ఓ లేఖను రాసారు ఎన్టీఆర్. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది. “నాకు అత్యంత ఆప్తుడు, కృష్ణ జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ ఇక లేరు అన్న వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది.

 

`నిన్ను చూడాలని` చిత్రం తో మొదలయిన మా ప్రయాణం ఇలా అర్ధాంతరం గా ముగిసిపోతుంది అని ఊహించలేదు. నటుడి గా నేను చుసిన ఎత్తుపల్లాలలో నాకు వెన్నంటే ఉన్నది నా అభిమానులు. ఆ అభిమానులలో.. నేను వేసిన తొలి అడుగు నుండి నేటి వరకు నాకు తోడు గా ఉన్న వారి లో జయదేవ్ చాలా ముఖ్యమైన వారు. జయదేవ్ లేని లోటు నాకు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ని తెలుపుతున్నాను” అని లేఖ రాసారు.