ఇక మీదట ఉడతల్ని చూసినా భయపడతారు
Spread the love

ఉడత.. చూడటానికి చాలా చిన్నగా, బుజ్జిగా భలే ముద్దుస్తోంటుంది. రామయణంలో కూడా దీనికో ప్రత్యేక స్థానం ఉంది. రాముని మీద భక్తితో తనకు తోచిన సాయం చేసి.. ఉడతా భక్తిగా ప్రసిద్ధి పొందింది. అలాంటి ఆ చిన్న ప్రాణిని చూస్తే ఎవరికైనా ముద్దుస్తోంది. కానీ ఇప్పుడు మేం చెప్పబోయేది వింటే.. ఇక మీదట ఉడతల్ని చూసినా భయపడతారు. సాధరణంగా పాము, ముంగిసల మధ్య వైరం సాధరణం. ఒక వేళ పాము, ఉడతల మధ్య ఘర్షణ జరిగితే.. ఏది గెలుస్తుంది. పాము అనుకుంటాం. కదా. కానీ ఇక్కడ సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఉడత కాస్తా పామును చంపి తింది. నమ్మశక్యంగా లేకపోయిన ఇది వాస్తవం.

ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతోంది. అమెరికా నేషనల్‌ పార్క్‌ అధికారులు షేర్‌ చేసిన ఈ ఫోటోలో ఓ ఉడత.. పామును తల దగ్గర గట్టిగా పట్టుకుని.. తినడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫోటో గురించి అధికారులు మాట్లాడుతూ.. ‘ఉడతలనగానే.. పళ్లు, గింజలు లాంటివి తిని జీవిస్తాయి అనుకుంటాం. కానీ రాక్‌ ఉడతలు ఆకులు, అలమలతో పాటు బల్లులు, పాములు, గుడ్లను కూడా తింటాయి. ఈ ఫోటోలో ఉన్న రాక్‌ ఉడత కూడా  పామును తినేస్తుంది. ఇది వాటి స్వభావం’ అని తెలిపారు. సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఈ ఫోటో ఇప్పటికే వేల షేర్స్‌, కామెంట్స్‌ అందుకుంది. ‘ఇక మీదట ఉడతల్ని చూసి కూడా భయపడాలి’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు​. అయితే ఈ ఫోటో ఇప్పటిది కాదని.. 2009లో తీశారని… దాన్ని ఇప్పుడు ఇంటర్నెట్‌లో మరో సారి షేర్‌ చేశారని తెలిపారు అధికారులు.