ఇలాంటి ప్రయాణం ఎప్పుడూ చేసుండరు: వైరల్‌
Spread the love

ఇస్లామాబాద్‌ : మామూలుగా బైక్‌పై పెంపుడు కుక్కలను ఎక్కించుకుని ప్రయాణం చేసేవాళ్లను చూసుంటారు. చాలా కుక్కలు యాజమాని బైక్‌పైకి ఎక్కిన తర్వాత బుద్ధిగా కూర్చుని, రోడ్డుపై వెళ్లేవాళ్లను, పరిసరాలను చూస్తుంటాయి. ఇది అంత ఆశ్చర్యకరమైన విషయం కాదు. కానీ! ఓ యువకుడు మాత్రం ఇందుకు భిన్నంగా తన బైక్‌పై ఆవును ఎక్కించుకుని ప్రయాణం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌కు చెందిన ఓ యువకుడు ఆవును తన బైక్‌పై ఎక్కించుకుని ప్రయాణం చేశాడు. ఆ ఆవుకూడా అలవాటున్న దానిలా ఏ బెరకూలేకుండా ప్రయాణం చేసింది. ఈ వింతను అతని పక్కగా ప్రయాణిస్తున్న వారు వీడియో తీసి, సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.

దీంతో ఈ వీడియోపై పలువురు నెటిజన్లు కామెడీగా స్పందించారు. ‘‘ అసలైన కౌబాయ్‌ అంటే ఇతడే.. ఇలాంటివి కేవలం పాకిస్తాన్‌లో మాత్రమే జరుగుతాయి.. పాకిస్తాన్‌కి మీకు స్వాగతం.. మీ పందుల్ని, కుక్కల్ని, ఆవుల్ని తీసుకురండి, అద్భుతమైన ప్రయాణం చేయండ’’ని కామెంట్లు చేశారు.