యూట్యూబ్‌కు పోటీ గా, మరో సోషల్ మీడియా నెట్ వర్క్
Spread the love

ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను కాఫీ చేయడంలో ఇన్‌స్టాగ్రామ్‌కు సాటి లేనిది ఏదీ లేదు. ఫేస్‌బుక్ తన సొంతం చేసుకున్న ఈ సంస్థ, అదే ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ మాధ్యమం వాట్సాప్‌, స్నాప్‌చాట్‌లోని పలు ఫీచర్లను కాఫీ కొట్టింది. తాజాగా కూడా ఫేస్‌బుక్‌కు చెందిన మరో యాప్‌ యూట్యూబ్‌ను కాఫీ కొట్టి, దానికే గట్టి పోటీగా నిలవాలని చూస్తోంది. అదేమిటంటే.. వీడియోల షేరింగ్‌లో ఇప్పటి వరకు ఉన్న టైమ్‌ పరిమితిని తొలగించడం.

యూట్యూబ్‌ తరహాలో కంటెంట్‌ మాదిరిగా ఇన్‌స్టాగ్రామ్‌ను తీర్చిదిద్దే యోచనలో సంస్థ ఉన్నట్టు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ రిపోర్టు చేసింది. ఇక మీదట గంట నిడివి ఉన్న వీడియోలను పోస్టు చేసే అవకాశం కల్పిస్తోందని తెలిపింది. దీని కోసం ఓ కొత్త ఫీచర్‌ను కూడా తేబోతుందని పేర్కొంది. ‘వర్టికల్‌ మీడియో’ పై ఇన్‌స్టాగ్రామ్‌ ఎక్కువగా దృష్టిపెట్టిందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ రిపోర్టు చేసింది. ప్రస్తుతం యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక్క నిమిషంలోపు ఉన్న వీడియోలనే పోస్ట్ చేసేందుకు అవకాశం ఉంది. ఈ పరిమితిని ఎత్తేసే గంట వరకు ఉన్న వీడియోలకు ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా మలిచే ప్రయత్నాలు మొదలైనట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ ఫీచర్ పేరును లాంగ్ ఫామ్‌గా కంపెనీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. స్టోరీస్‌ ఫీచర్‌ లాంచ్‌ చేసిన రెండేళ్ల తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ ఈ ఫీచర్‌ను తీసుకొస్తోంది. స్టోరీస్‌ ఫీచర్‌ ద్వారా 24 గంటల ఫార్మాట్‌లో ఫోటోలను, వీడియోలను పోస్టు చేసుకోవచ్చు. అయితే స్టోరీస్‌లో పోస్టు అయిన వీడియోలు 15 సెకన్లు లేదా గరిష్టం 60 సెకన్లు మాత్రమే న్యూస్‌ ఫీడ్‌లో ఉంటాయి. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకొస్తున్న లాంగ్‌ ఫామ్‌ ఫీచర్‌ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, ఇందులో మార్పులకు అవకాశం లేకపోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఫీచర్‌కు సంబంధించి నిర్మాతలు, క్రియేటర్లతో సంస్థ సంప్రదింపులు జరిపి, ఎక్కువ నిడివి వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌ కోసమే రూపొందించాలని కూడా కోరినట్టు వెల్లడించాయి. వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో యూట్యూబ్‌ మాత్రమే ఇప్పుడు చాలా పాపులర్‌గా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకొస్తున్న ఈ ఫీచర్‌ ద్వారా ఇక యూట్యూబ్‌కు అది గట్టి పోటీగా నిలువనున్నట్టు తెలుస్తోంది. యూట్యూబ్‌ కేవలం వీడియోలను మాత్రమే అందిస్తుండగా.. ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలతో పాటు ఇతర సర్వీసులను అందజేస్తోంది.

Leave a Reply