ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు
Spread the love

*అప్పట్లో కష్టం అంటే* –

తినడానికి….. సరైన తిండి దొరక్కపోవడం

చదివినా…. ఉద్యోగం దొరక్కపోవడ0

భార్యకి… భర్తపోరుఅత్తపోరు

ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు

ఆరుగాలం కష్టపడిన రైతుకి… పంట చేతికి అందకపోవడం

ఇంటిల్లపాది….
ఒక్కరి సంపాదనతో బ్రతకడం

చాలీచాలని జీతాలు

ఇలా ఒకస్థాయిలో ఉండేవి.

మిగతావాటికి చాలావరకు సర్దుకుపోయేవారు…. సరిపెట్టుకునేవారు.

*ఇప్పుడు కష్టం అనే రూపురేఖలు మారిపోయాయి* –

పరీక్ష తప్పితే కష్టం

అమ్మ తిడితే కష్టం

నాన్న కొడితే కష్టం

పాఠాలు నేర్పే గురువు అరిస్తే కష్టం

సరైన చీర కొనకపోతే కష్టం..!

*ఇప్పటివారి కష్టాలకి కారణం ఒక్కటే* –

అనుకున్నది…. దొరకాలి
అప్పుడు…. కష్టం లేనట్లు

పిన్నీసుదొరక్కపోయినా,
ప్రాణం పోయేంత…. కష్టం వచ్చినట్లు బాధ పడిపోతున్నారు

అప్పట్లో మనస్సు చాలా బలంగా ఉండేది❤

ఎందుకంటే చిన్ననాటి నుండి కష్టాలు చూసి పెరిగేవారు

ఇప్పుడు కష్టం అంటే ఏంటో తెలియకుండా….
తల తాకట్టుపెట్టయినా పిల్లలు కోరిందల్లా…

వాళ్ళ కాళ్ళ ముందు పెడుతున్నాము⌚

మానసిక బలం తగ్గిపోబట్టి వాళ్ళకిప్పుడు ప్రతీది కష్టమే

అంతెందుకు మొన్న

కర్ణాటక లో ఒక IAS ఆఫీసర్
కోస్తాంధ్ర లో ఒక IPS ఆఫీసర్‍✈
సినిమా హీరోలు
ఎంతోమంది సబ్ ఇన్స్పెక్టర్లు
ఐఐటీ స్టూడెంట్స్
మెడికోస్

కూడా మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య లు చేసుకున్నారు

ఇప్పటి *కొత్తతరం పెద్దలకి* చెప్పేది ఏంటంటే –

చదవండి.. చదివించండి.
దాంతోపాటే కష్టపడడం నేర్పండి

“మేము పడుతున్న కష్టం చాలు,….
పిల్లలెందుకు కష్టపడాలి”
అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు☹!

మీరు ఎంత కష్టపడుతున్నారో తెలియజేస్తూ వారిని పెంచండి

అప్పుడే వారికి కష్టం విలువ తెలుస్తుంది.

జీవితంలో వారు స్థాయిలను చేరుకోవడానికి పునాది అవుతుంది

https://www.facebook.com/groups/hasyanandham/permalink/1678578878935094/