ఇప్పుడు సంతోషమేన ?
Spread the love

ఒక మానవుడు విచారంగా కుర్చుని బాధపడుతున్నాడు . అటు వైపు వచ్చిన ఓ సన్యాసీ అతడి దుఃఖం కి కారణం తెలుసుకోవాలనుకున్నాడు .

సన్యాసీ :- ఓ మానవా ! ఏమిటి నీ బాధ ?

మానవుడు :- జీవితం లో సంతోషమే లేదు స్వామి .

వెంటనే ఆ సన్యాసీ తన చూపుడు వేలును అక్కడున్న రాయికేసి చాచాడు .

ఆ రాయి బంగారు రాయి గా మారిపోయింది .

సన్యాసీ :- ఇప్పుడు సంతోషమేన ?

మానవుడు :- ఆఆ …అదొక రాయే కదా !

ఈ సారి తన చూపుడు వేలుతో ప్రక్కనే ఉన్న చెట్టును బంగారు చెట్టు గా మార్చేసాడు .

సన్యాసీ :- ఇప్పుడేమంటావు ?

మానవుడు :- అదొక చెట్టే కదా !

మల్లి చూపుడు వేలును ఇంటివైపు చూపించాడు . ఇల్లు బంగారు ఇల్లు గా మారిపోయింది .

సన్యాసీ :- ఇది చాలా ?

మానవుడు :- అదొక ఇల్లే కదా !

సన్యాసీ :- ఇంత బంగారాన్నిచినా నీకు సంతోషం కలగలేదే ! అయితే నీకేం కావాలి ?

మానవుడు :- నీ చూపుడు వేలు కావాలి స్వామి .!!

https://www.facebook.com/groups/hasyanandham/permalink/1749740608485587/