పంచ్ కి పంచ్….
Spread the love

భార్యా , భర్త భోజనం చేస్తున్నారు …

భర్త : ఏమే ..! పెరుగు వడ్డించు …
( పెరుగు వడ్డించి , ఆమె తింటున్నారు )

భర్త : పెరుగు వడ్డించావ్ ..! మరి ఉప్పు ఎవరు వడ్డిస్తారు … మీ బాబా ..!? ( కోపంగా )

( అప్పుడావిడ , స్పూన్ తో కాకుండా పెద్ద గరిట నిండుగా వేసేసింది )

భర్త : ఇదేంటి ఇంత వేసావ్ ..!?

భార్య : నాది పెద్ద చెయ్యండి , ఎక్కువే వచ్చేస్తుంది … మీ అమ్మ లాగా నాది చిన్న చెయ్యి కాదు ..!? ( వెటకారంగా )

కాసేపు గడిచాక …

భార్య : ఆ మంచినీళ్లు ఇలా అందుకోండి ..!

భర్త : ( చిన్న స్పూన్ తో ఇస్తూ ..! ) సరిపోతాయా ..!?

భార్య : అదేంటి ఇవెలా సరిపోతాయ్ …!?

భర్త : నాకు జాగ్రత్త ఎక్కువే ..! మీ బాబు లాగా దుబారా మనిషిని కాను నేను ..! నాకు కుటుంబ బాధ్యతలు తెలుసు …

మొగుళ్లకు కూడా అప్పుడప్పుడు ఇలా సెటైర్లు వేసే అవకాశం లాటరీ తగిలినట్టు దొరుకుతుంది … ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి … మీ ఇగో ని సేటిస్ఫై చేసుకోండి …
😋😂😆😄😍😅😉😝😜😊

https://www.facebook.com/groups/hasyanandham/permalink/1826767280782919/