మా ఇంటికి తప్పకుండా రావాలి…
Spread the love

హలొ
నమస్కారం గురువుగారు.
బావున్నారా?
చాలా కాలం అయ్యిన్ది మిమ్మల్ని చూసి.
మాఇంటికి రండి.
ఎక్కడంటాారా.
బస్ లో దిగి తిన్నగా వస్తే సెంటర్లో నాలుగు తెల్ల కుక్కలు
ఉంటాయి.
కుడి ప్రక్కకు తిరిగి ముందుకు వెళ్తే రెండు నల్ల కుక్కలు వాటిని దాటి
ఎడమ పక్క కు తిరిగితే ఒక కుంటి కుక్క.
ఆ ప్రక్కన 5వ ఇల్లు.ముందర ఒక గజ్జి కుక్క
గుర్తుపట్టడం సులువే.
తప్పకుండా రావాలి.
మా ఊరిలో మనుషులు ఉన్నారా? అంటారా?
కుక్కలకి భయపడి ఇంటిలోనే ఉంటున్నారు.
మీకు కుక్కలంటే భయమా?
పర్వాలేదు.
మా ఇంటిలో కుక్క కరిస్తే వేసే మందులున్నాయి.
మీరు మటుకు తప్పకుండా రావాలి.
తప్పదు మరి
మా ఇంటికి చుట్టాలు వచ్చి చాలా కాలం అయ్యింది.
రాపోతే నా మీద ఒట్టే.
ఏమిటీ. మీకు ఒట్టు మీద నమ్మకం లేదా?
నాకు ఉంది.
మీరు రాకపోతే మీ మీద ఒట్టే.
ఒట్టు తీసి గట్టు మీద పెట్టడాలు లేవు.
హలొ
హలొ
హలొ.

https://www.facebook.com/groups/hasyanandham/permalink/1816997941759853/