ఆ గేదె తెలివికి ఆశ్చర్యపోతారు: వైరల్‌
Spread the love

ఈ భూమిపై మనిషి అతి..తెలివైన జీవిగా తన ఉనికిని చాటుకుంటున్నాడు. మనిషి తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనిషంత కాకపోయినా! ఓ మోస్తరు తెలివి ప్రదర్శించి, మనిషుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి కొన్ని జీవులు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గేదె తెలివితేటలకు నెటిజన్లు ఔరా! అంటున్నారు. మండుతున్న మధ్యాహ్నం వేళ ఓ గేదెకు దాహం వేసింది. పక్కన ఎక్కడా నీళ్లు కనిపించకపోయేసరికి అక్కడే ఉన్న బోరింగ్‌ పంప్‌ దగ్గరకు వచ్చింది. బాగా అలవాటున్న దానిలా బోరింగ్‌ హ్యాండ్‌ను కొమ్ములతో పైకి కిందకు అని, వచ్చిన నీళ్లు తాగింది. అలా పలుమార్లు హ్యాండ్‌ను పైకి కిందకు అని దాహం తీర్చుకున్నాకే అక్కడినుంచి కదిలింది.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి