పాస్వర్డ్ కావాలా బాబు
Spread the love

ఓక బార్ కం రెస్టారెంట్ బయట బోర్డు ఇలా ఉంది.

*ఇచ్చట వైఫై ఫ్రీ గా ఉపయోగించుకో వచ్చును*

ఓ పీనాసోడు ఆ బోర్డు చుాసి పడిపోయేటంత స్పీడుగా లోపలికి పరిగెత్తాడు.

బేరర్ ని పిలిచి వైఫై పాస్ వర్డ్ అడిగాడు.

బేరర్ : బై వన్ పెగ్

పిసినారి : ఆ.. ఓ పెగ్గేగా అని ( ఛీప్ క్వాలిటీది) ఓ పెగ్ తాగి బేరర్ ని పిలిచి వైఫై పాస్ వర్డ్ అడిగాడు.

బేరర్ : బై వన్ పెగ్

పిసినారి కోపంతో బేరర్ వైపు చుాసి కౌంటర్ దగ్గరకెళ్ళి వైఫై పాస్ వర్డ్ అడిగాడు.

క్యాషియర్ : బై వన్ పెగ్

పిసినారి తమాయించుకుని మళ్ళీ ఓ పెగ్ తాగి అడిగాడు.

క్యాషియర్ : బై వన్ పెగ్

ఇక వీడి తాగిన మందు కోపం నషాళానికెక్కి డైరెక్టగా బార్ ఓనర్ రుామ్ లోకి వెళ్ళి పాస్ వర్డ్ అడిగాడు.

ఓనర్ : బై వన్ పెగ్

వీడి దగ్గర బై వన్ పెగ్గులతో డబ్బులు అయిపోయినయ్.

హాల్ లోకి వచ్చి అయ్యో మీ పుణ్యం ఉంటది ఎవరైనా ఒక్కసారి పాస్ వర్డ్ చెప్పండి ప్లీజ్ అన్నాడు.

 

అందరుా ఒకేసారి *బై వన్ పెగ్* అని గోడమీద అంటించిన వైఫై పాస్ వర్డ్ పేపర్ చుాపించారు.

 

*పాపం వీడి దగ్గర డబ్బులు అయిపోయి తాగింది కుాడా దిగిపోయింది ఆప్పటి దాకా తను చుాడని ఆ గోడ మీద అంటించిన ” పాస్ వర్డ్ : బై వన్ పెగ్ ” అన్న పేపరు చుాసి*😂😀😜