జనసేన అధినేతను కలిసిన శెట్టిబలిజ నేతలు
Spread the love

తూర్పు గోదావరి జిల్లా ముమ్ముడివరం నియోజకవర్గం మాజీ వై సి పి సమన్వయ కర్త పితాని బాలకృష్ణ జనసేన పార్టీలో చేరనున్నారు . హైదరాబాద్ లోని మాదాపూర్ పార్టీ కార్యాలయంలో సోమవారం తన అనుచరులతో సహా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని శ్రీ పితాని కలిశారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ముఖ్యoగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల్లో ఒకటైన “కులాలను కలిపే ఆలోచన విధానం ” తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరు ఆచరించవలసి ఉందని పవన్ కళ్యాణ్ గారితో పితాని ప్రస్తావించారు . తాను సామాజికంగా శెట్టిబలిజ కులానికి చెందినవాడినని ,శెట్టిబలిజలకు సరైన రాజకీయ ప్రాధాన్యం లభించడం లేదని శ్రీ పితాని ఆవేదన వ్యక్తం చేసారు . తమ కులస్థులను రాజకీయ పార్టీలు తమ అవసరం కోసం ఉపయోగించుకొని ఆ పై మోసం చేస్తున్నాయని అయన ఆవేదన వ్యక్తం చేసారు .

శెట్టిబలిజలతో పాటు వెనుకబడిన కులాలకు తాను అండగా ఉంటానని పవన్ కల్యాణగారు వారికీ భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో శెట్టిబలిజలకు జనసేన తగిన ప్రాధాన్యత ఇస్తుందని పవన్ కళ్యాణ్ గారు వారికి హామీ ఇచ్చారు . శ్రీ పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్ల్లాల పర్యటన సమయాల్లో సమయంలో తమ అనుచరులతో కలిసి పార్టీలో చేరనున్నట్లు శ్రీ పితాని బాలకృష్ణ ప్రకటించారు . గతంలో ఆయన పోలీస్ శాఖలో ఉద్యోగిగా పనిచేసారు . శ్రీ పీతానితో పాటు శ్రీ కొప్పిశెట్టి బాలకృష్ణ ,శ్రీ గుత్తుల వెంకటేశ్వరరావు ,సానబోయిన వీరభద్రరావు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు .