టీడీపీతో పొత్తు కొంపముంచుతుందని ముందే హెచ్చరించా: విజయశాంతి
Spread the love

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ లు ప్రజాకూటమిగా ఏర్పడి పోటి చేసి ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆమెను కలిసేందుకు మెదక్ జిల్లా నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో విజయశాంతి మాట్లాడారు.

తెలుగుదేశంతో పొత్తు కొంపముంచుతుందని తను ముందే హెచ్చరించిన విషయాన్ని వారితో విజయశాంతి ప్రస్తావించినట్టు సమాచారం.టీడీపీతో పొత్తు పెట్టుకుంటే గెలుస్తామనే ధీమాతో సొంత వ్యూహాన్ని కాంగ్రెస్ నేతలు పక్కన పెట్టడం వల్ల ఓటమి పాలయ్యామంటూ రాష్ట్ర నాయకత్వాన్ని ఆమె తప్పుబట్టారు.తెలుగుదేశంతో పొత్తు కారణంగా జరిగిన నష్టంపై అధిష్ఠానానికి ఒక నివేదిక ఇస్తానని సార్వత్రిక ఎన్నికల నాటికైనా కాంగ్రెస్ పార్టీ తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.