చరిత్ర లో  మెదటి సారి ప్రధాని వ్యాఖ్యలను తోలగి౦చిన  రాజ్యసభ ఛైర్మన్ !!
Spread the love

ఊహించనటువంటి విషయం ఒకటి పార్లమెంటులో జరిగింది . పార్లమెంటు చరిత్రలో ఏ రోజు జరగని అరుదైన సంఘటన తాజాగా రాజ్యసభలో చోటు చేసుకుంది. మాములుగా విపక్ష నేతల వ్యాఖ్యల్ని రికార్డుల్లో నుంచి తీసేయడం మామూలు విషయమే . దీనికి భిన్నంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యల్ని తొలగిస్తూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా సంచలన అంశంగా మారింది.

భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యల్ని పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. దీనికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? నరేంద్ర మోడీ ఏమని వ్యాఖ్యానించారు? ఎందుకు రికార్డుల నుంచి తొలగించారన్నది చూస్తే..

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి ఎలక్షన్స్ పోటీగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో ఎన్డీయే నుంచి హరివంశ్ నారాయణ్ సింగ్ గెలిచారు . ఆయనపై పోటీ చేసిన విపక్షాల అభ్యర్థి బీకే హరిప్రసాద్ ఓటమి పాలయ్యారు . ఎన్నికల ఫలితం వచ్చిన వెంటనే రాజ్యసభకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్నికైన హరి వంశ్ నారాయణ్ ను అభినందించారు.

ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అభ్యన్తరాలుగా మారాయి. విపక్ష అభ్యర్థి బీకే హరిపై మోడీ ఊహించని పద్ధతిలో వ్యాఖ్యలు చేశారు. తనదైన శైలితో  కూడిన చమక్కుల్ని ఉపయోగించారు .ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల్ని తెలుగులో గమనిస్తే .. ఇరువైపులా హరి అనే పేరు గల వ్యక్తులే ఉన్నారు. ఒకరి ఇంటి పేరు బీకే (హిందీలో బీకే అంటే అమ్ముడుపోవటం అన్న అర్థం ఉంది).. కానీ ఆయన అమ్ముడు పోలేదు. ఇక్కడ మరో బీకే అమ్ముడుపోయారు. కానీ మరో హరి మాత్రం అమ్ముడు పోలేదంటూ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ అభ్యర్థి బీకే హరి అమ్ముడు పోయారని.. కానీ గెలవలేదని.. కానీ.. తమ పార్టీ అభ్యర్థి హరి మాత్రం అమ్ముడుపోలేదు అని అర్థం వచ్చేలా చేసిన వ్యాఖ్యలను పలువురు తప్పు పట్టారు. ప్రధానమంత్రి వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం తెలిపారు . అసలే ఓడిపోయాను అనే బాధతో ఉన్న హరిప్రసాద్ మోడీ మాటలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని హోదాను.. సభ గౌరవాన్ని ఆయన దిగజార్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై చేసిన ఫిర్యాదును పరిశీలించిన రాజ్యసభ ఛైర్మన్ రికార్డుల నుంచి మోడీ చేసిన వ్యాఖ్యను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఊహించని పద్ధతితో చోటు చేసుకున్న ఈ వైనంపై బీజేపీ డిఫెన్స్ లోపడింది. అంతలోనే కవర్ చేస్తూ.. మోడీ వ్యాఖ్యల తొలగింపు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిష్పక్షపాక్షికతకు నిదర్శనంగా బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. వెంకయ్య గొప్పతనం సరే.. ప్రధాని స్థానంలో ఉన్న మోడీ ఇలా మాట్లాడటం ఏంటి అనే దానిపైన వివరణ ఇస్తే బాగుంటుంది.