బరిలో 201 మంది
Spread the love

ఆత్మకూరు(పరకాల): జిల్లాలో దుగ్గొండి, నర్సంపేట, పర్వతగిరి, సంగెం, వర్ధన్నపేట మండలాల్లో ఆదివారం ఉపసంహరణ  గడువు ముగిసింది. 5 జెడ్పీటీసీ స్థానాలకు 32 మంది,  62 ఎంపీటీసీ స్థానాలకు గాను 4 స్థానాలు ఏకగ్రీవం కాగా 169 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 201 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సంగెం మండలంలోని కుంటపల్లిలో ఎంపీటీసీ కందకట్ల కళావతి(టీఆర్‌ఎస్, దుగ్గొండి మండలం మల్లంపల్లి ఎంపీటీసీ సభ్యుడిగా పల్లాటి జైపాల్‌రెడ్డి(టీఆర్‌ఎస్‌), వర్దన్నపేట మండలంలో నల్లబెల్లి ఎంపీటీసీ దుగ్యాల జ్యోతి(టీఆర్‌ఎస్‌), దమ్మన్నపేట ఎంపీటీసీ చొప్పరి సోమలక్ష్మి (టీఆర్‌ఎస్‌) ఏకగ్రీవమైంది. 58 ఎంపీటీసీ స్థానాలకు గాను 169 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  కాగా నల్లబెల్లి జెడ్పీటీసీ స్థానానికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి పెద్ది స్వప్న ఆదివారం నామినేషన్‌ దాఖలు చేశారు.

ముగిసిన రెండో విడత నామినేషన్లు
6 జెడ్పీటీసీ స్థానాలకు 68, 63 ఎంపీటీసీ స్థానాలకు 531 నామినేషన్లు
ఆత్మకూరు(పరకాల): 
జిల్లాలో పరిషత్‌ ఎన్నికలకు రెండో విడత నామినేషన్లు ఆదివారం ముగిసాయి. జిల్లాలోని ఖానాపురం, నల్లబెల్లి, పరకాల, నడికూడ, శాయంపేట, రాయపర్తి మండలాలకు సంబంధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించారు. 6 జెడ్పీటీసీ స్థానాలకు 68 నామినేషన్లు, 63 ఎంపీటీసీ స్థానాలకు 531 నామినేషన్లు దాఖలయ్యాయి. ఖానాపురం జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్‌ (3), టీఆర్‌ఎస్‌(5), టీడీపీ(1), సీపీఐ(1) మొత్తం 10 నామినేషన్లు దాఖలయ్యాయి.

నల్లబెల్లి స్థానానికి కాంగ్రెస్‌(5), బీజేపీ(3), టీఆర్‌ఎస్‌(5), టీడీపీ(2), ఇతర పార్టీ(1), ఇండిపెండెంట్లు(3) మొత్తం  19 నామినేషన్లు దాఖలయ్యాయి. పరకాలలో బీజేపీ(1), కాంగ్రెస్‌ (4), టీఆర్‌ఎస్‌(1) మొత్తం 6 నామినేషన్లు దాఖలయ్యాయి. నడికుడలో కాంగ్రెస్‌(4), బీజేపీ(1), టీఆర్‌ఎస్‌ (2), టీడీపీ(1) మొత్తం 8 నామినేషన్లు దాఖలయ్యాయి. శాయంపేట జెడ్పీటీసీ స్థానానికి బీజేపీ(1), కాంగ్రెస్‌(3), టీఆర్‌ఎస్‌(4), ఇండిపెండెంట్‌(4) మొత్తం 12 నామినేషన్లు దాఖలయ్యాయి. రాయపర్తి జెడ్పీటీసీ స్థానానికి బీజేపీ(1), కాంగ్రెస్‌(5), టీఆర్‌ఎస్‌(4), టీడీపీ(1), ఇండిపెండెంట్‌(2) మొత్తం 13 నామినేషన్‌లు

దాఖలయ్యాయి.. ఎంపీటీసీ స్థానాల్లో…
జిల్లాలో 6 మండలాలలో 63ఎంపీటీసీ  స్థానాలకు 531 నామినేషన్లు దాఖలయ్యాయి. ఖానాపూర్‌ మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలకు సీపీఐ(3), కాంగ్రెస్‌ (31) టీఆర్‌ఎస్‌(38), టీడీపీ(1), ఇండిపెండెంట్‌(9) మొత్తం 82 నామినేషన్లు దాఖలయ్యాయి. నల్లబెల్లి మండలంలో 11ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ(3), కాంగ్రెస్‌(25), టీఆర్‌ఎస్‌(49), టీడీపీ(1), ఇతరపార్టీలు(5)ఇండిపెండెంట్‌(9) మొత్తం 92 నామినేషన్‌లు దాఖలయ్యాయి.పరకాల మండలంలో 5ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ(1), కాంగ్రెస్‌(19),టీఆర్‌ఎస్‌(12), టీడీపీ(1), ఇతరపార్టీలు(2), ఇండిపెండెంట్‌(8) మొత్తం 43 నామినేషన్లు దాఖలయ్యాయి.

నడికుడ మండలంలో 10ఎంపీటీసీ స్థానాలకు  బీజేపీ(2), కాంగ్రెస్‌(20), టీఆర్‌ఎస్‌(18),టీడీపీ(2), ఇండిపెండెంట్‌(9) మొత్తం 51 నామినేషన్లు దాఖలయ్యాయి. శాయంపేట మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ(7)కాంగ్రెస్‌(22), టీఆర్‌ఎస్‌(91), ఇండిపెండెంట్‌(24),  ఇతర పార్టీ(10) మొత్తం 154 నామినేషన్లు దాఖలయ్యాయి. రాయపర్తి మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలకు గాను బీజేపీ(5), కాంగ్రెస్‌(40), టీఆర్‌ఎస్‌(51), ఇండిపెండెంట్‌(13) మొత్తం 109 నామినేషన్లు దాఖలయ్యాయి.