జనసేన పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని సత్యనారాయణ…
Spread the love

జనసేన పార్టీ పథకాలను సిద్ధాంతాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకువెళ్లాలని మండపేట జనసేన నాయకులు పిల్లా సత్యనారాయణ గారు పేర్కొన్నారు. ఇటీవల జనసేన జిల్లా సోషల్ జస్టిస్ విభాగానికి మండపేట పట్టణానికి చెందిన కొనాల సుభాష్ చంద్రబోస్ ను కో కన్వీనర్ గా నియమించారు. ఈ సందర్భంగా పట్టణానికి జిల్లాస్థాయి పదవి దక్కడం తో జనసైనికులు ఆనందం వ్యక్తం చేస్తూ స్థానిక మెయిన్ రోడ్ లోని జనసేన కార్యాలయం లో మంగళవారం చంద్ర బోస్ అభినందన సభ ఏర్పాటు చేశారు. పిల్లా ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు పిల్లా సత్యనారాయణ, దొమ్మేటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సత్యనారాయణ మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం ఏర్పాటైన సోషల్ జస్టిస్ విభాగాన్ని బలోపేతం చేయాలని అన్నారు. కులమతాల అంతరాలు లేని సమాజం ఏర్పాటు చేయడమే జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ దిశగా ప్రతి సైనికుడు పవన్ ఆశయాలను ఆచరణలో కి తేవాలన్నారు. ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను వివరించాలన్నారు. ప్రజల కోసం జనసేన ఏం చేయాలనుకుంటుందో వివరించాలని కోరారు .ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల పేద బడుగు బలహీన వర్గాలు కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారని వారికి అండగా జనసేన నిలబడుతుందనే భరోసా కల్పించాలని పేర్కొన్నారు. దొమ్మేటి మాట్లాడుతూ మండపేట కు చెందిన యువకుడిని జిల్లా కన్వీనర్ గా నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. కష్టపడి పని చేసిన వారందరికీ పార్టీలో గుర్తింపు ఉంటుందనే దానికి ఇదే నిదర్శనమని తెలిపారు.