జనసేన పక్ష పత్రిక “శతఘ్ని” ఆవిష్కరణ : పోరాడే సేన కావాలి
Spread the love

మహిళలు కాళీ, దుర్గల్లా ఉండాలి సరస్వతిలా చదువు చెప్పాలి వారికి కనీస భద్రత అవసరం జగన్ లా నేనూ తిట్టగలను కానీ బాధ్యతారహితంగా మాట్లాడను సీఎం సింగపూర్ పాలన ఊసిత్తరేం? వీరమహిళ భేటీలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఆలోచించే వాళ్ళు పోరాటం చేసే వాళ్ళు జనసేనకి అవసరమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మహిళలు కాళీ,దుర్గామాతల ఉండాలని,స్వరస్వతిల చదువుచెప్పి జ్ఞానాన్ని పంచే వాళ్ళు పార్టీకి కావాలని చెప్పారు. మహిళలను రోడ్లపై కూర్చోపెట్టి ఇతరులను తిటించే రాజకీయాలు వద్దన్నారు.గురువు జ్ఞానం సహసం ఉన్న వాళ్ళు ,అవమానాలతో ముందుకు సాగేవాళ్ళ పార్టీ అవసరమన్నారు. మాదాపూర్ లోని జనసేన కార్యాలయంలో తెలుగు రాష్ట్రాలకి చెందిన వీరమహిళా కార్యకర్తలతో అయన సమావేశమ్యారు. జగన్మోహనరెడ్డి నన్ను తిడుతుంతే నేను అతని తిరిగి తిట్టలేకకాదు.నేను కూడా బలంగా తిట్టగలను వాళ్ళ కుటుంబసభ్యులు,ఆడపడుచులు నాకు గుర్తుకోస్తారు.అలా బాధ్యతారహితంగా మాట్లాడలేను అని అన్నారు. రాత్రివేళ షూటింగులకు హాజరయ్యే ఆడపిల్లలు తిరిగి ఇళ్లకు వెళ్లేందుకు స్వయంగా వాహనాలు ఏర్పాటు చేసేవాడిని అని అన్నారు. మహిళలకు కనీస భద్రతా కల్పించడం అవసరం, వారి పని వారు చేసుకోనిస్తే చాలు. మహిళల సారికారాత్ రావాలంటే సామజిక మద్దతు అవసరం. రాజకీయ సేవ రంగంలోకి వచ్చేవాళ్ళకి వెన్నుముక్కల నిలవాలి.జనసేన మహిళా విభాగన్ని పెంచకంపోవడానికి కారణం ఉంది. మహిళకు కోపం ఎక్కువ తక్కువ ఒకమాట అనేయొచ్చూ అది ఇళ్లలో ఐతే సరిపోతుంది కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి కుదరదు,సద్దుకుపోవాలి అని వ్యాఖ్యనించారు. ఆడపిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లి క్షేమంగా ఇంటికి వచ్చే పరిస్దితులు ప్రస్తుతం లేవన్నారు. మనదేశంలో స్త్రీ శక్తిని ఆరాధిస్తారని వారిలో అపారమైన శక్తి ఉంటుందని. దాని వెలికి తీసేందుకు వీర మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసానని అన్నారు. మహిళలు భావితరాలకు అండగా నిలబడేందుకు త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ సూచించారు. పార్టీ లో పనిచేస్తూ బాధ్యతగా వ్యవహరించేవారికి తప్పకుండా గుర్తింపు ఇస్తామన్నారు. తాను కొన్ని సరిచేసుకొని రాజకీయాలలోకి వచ్చానని,రెండు రెండు పడవల ప్రయాణం చేయడం సరికాదని బావించానను పవన్ కళ్యాణ్ తెలిపారు.

జనసేన విభాగంలో చేరేందుకు మహిళలు ఆసక్తి చూపడం అభినందనీయమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. వివేకం, విజ్ఞత, సహనం ఉన్న మహిళా సేనను సిద్ధం చేసుకుందామని ఆయన పిలుపు నిచ్చారు. పార్టీ కార్యాలయంలో వీర మహిళా విభాగం సమావేశం గురువారం నిర్వహించారు. . తెలుగు రాష్ట్రాల వీర మహిళా నాయకు లకు పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు,విధులపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, స్త్రీని శక్తి స్వరూపిణిగా కొలిచే మన దేశంలోనే ఆడపడుచులకు కనీస భద్రత కల్పించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మహిళలు అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళినపుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని మహాత్మాగాంధీ అన్నారని, ఇప్పుడు పట్టపగలు కూడా దైర్యంగా వెళ్ళలేని పరిస్థితి ఉందన్నారు. మహిళలకు, కనీస భద్రత కల్పించడం అవసరమని, వారి పనిని వారు స్వేచ్చగా చేసుకునేలా చూడాలన్నారు.

జనసేన పక్ష పత్రిక “శతఘ్ని” ఆవిష్కరణ : జనసేన పార్టీ సిద్ధాంతాలు, విధి విధానాలు, లక్ష్యాలను తెలియ చేసే వక్ష పత్రిక, కరదీపికలను జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో గురువారం ఒక కార్యక్రమంలో కరదీపికతోపాటు, పార్టీ తరపున ప్రారంభించిన పక్ష పత్రిక శతఘ్నిని విడుదలచేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు సిద్ధాంతాలపై అవగాహన కల్పించడంతోపాటు, వారికి దిశానిర్దేశం చేసేలా కరదీపిక ఉంటున్నారు. జనసేన సంకల్పం ఏమిటనేది ప్రతీ పాఠకునికి ఆ తెలియ చేసేలా శతఘ్ని వత్రిక ఉంటుందని వివరించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ బలమైన సిద్ధాంతాలు ఉన్న ఒకే ఒక్క పార్టీ జనసేన అన్నారు. తెలుగు దేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు సిద్ధాంతాలు లేవని, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 7 సిద్ధాంతాలను పార్టీ శ్రేణులకు అందించారని తెలిపారు. అవినీతి రహిత సమాజం లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. అలాగే పార్టీకి సంబంధించిన ఆ విషయాలను తెలియచేసేందుకు శతఘ్ని పేరుతో పక్ష పత్రికను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. పార్టీ శ్రేణులకు సంబంధించి డిసెంబర్ నెలాఖరుకు 50 లక్షల సభ్యత్వాలను నమోదు చేయాలనే లక్ష్యంగా కలిగి ఉన్నట్లు ఆయన చెప్పారు. అలాగే ఈ నెలలోనే వాడ వాడలా జనసేన జెండా ఆనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతీ జిల్లా, మండల కేంద్రాలతో పాటు, గ్రామం, బూత్ స్థాయిలో జనసేన జెండా ఎగరాలన్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాను గంగాధరం, మీడియా హెడ్ పి. హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.