లోకేష్ సవాల్‌కు పవన్‌ కల్యాణ్‌ కౌంటర్!
Spread the love

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కి మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. మోడీ దత్త పుత్రుడి అబద్ధపు ప్రచారం. అవినీతి అని గగ్గోలు పెట్టారు. నిరూపించమంటే ప్యాకప్ అన్నారు. ఇప్పుడు మరో సారి బాక్సైట్ మసి పూసే ప్రయత్నం చేస్తున్నారు. పదవి కోసం తప్పుడు ప్రచారం మాని ఆధారాలు ఉంటే బయటపెట్టమని సవాల్ చేస్తున్నా. అన్నారు. నారాలోకేష్ విసిరిన సవాల్ పై పవన్ కళ్యాణ్ ప్రతిస్పందించారు. వంతాడలో మైనింగ్ జరపడానికి పరమేశ్వరి మినరల్స్ అనే కంపెనీ గిరిజనులను మోసం చేసి సంతకాలు తీసుకుందని, దీంతో జిల్లా కలెక్టర్ ఈ మైనింగ్ లీజ్‌ను రద్దు చేసినట్లు ఇచ్చిన ఆదేశ పత్రాలను పవన్ బయటపెట్టారు. అనుభవజ్ఞుడైన నాయకుడని చంద్రబాబుకు మద్దతిస్తే అంతా అవినీతిమయం చేశారని ఆరోపించారు.