ముమ్మిడివరం మండలంలో జనసేన-జనబాట కార్యక్రమం
Spread the love

తూర్పు గోదావరి జిల్లా కొత్తలంక గ్రామంలో పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జనసేన-జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జనబాట ఇంచార్జ్ పతం నానాజీ ముఖ్య అతిధిగా హాజరవ్వడం జరిగింది. పంతం నానాజి మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు ఇరవై ఒక్క లక్షల ఓట్లు తొలగించారని జనబాట ముఖ్య ఉద్దేశం ఇంటిఇంటికి తిరిగి ఓటు నమోదు చేయించడం, తొలగించిన ఓట్లను గుర్తించి తక్షణమే నమోదు చేయించే విధంగా సూచించాలని కోరారు. జనసేన మానిఫెస్టోలోని అంశాలను ప్రజలకి వివరించడం ప్రతి జనసైనికుల కర్తవ్యం అని అన్నారు. అనంతరం కొత్తలంక గ్రామంలో జనసేన జనబాట కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులూ మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.