ఇంటింటికి తిరిగి జనసేన-జనబాట కార్యక్రమం ముమ్మర ప్రచారం
Spread the love

జనసైనికులు ఇంటింటికి తిరిగి జనబాట కార్యక్రమంలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా పి గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి గారు మాట్లాడుతూ.. జనసేన-జనబాట కు ప్రజా స్పందన జనసేన పార్టీ సిద్ధాంతాలు పట్ల ప్రజా స్పందన ఎక్కువగా ఉందని అని తెలిపారు. శుక్రవారం మాచవరంలో జనబాట కార్యక్రమం జరిగింది. జనబాట మండల కన్వీనర్లు, అరిగెల సూరిబాబు, మద్దిశెట్టి విజయ్ ఆధ్వర్యంలో ఇంటింటికి జనసైనికులు తిరిగి పార్టీ సిద్ధాంతాలను ఆశయాలను వివరించడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, రేషన్ కు బదులు నగదు బదిలీ కార్యక్రమాలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు శిరిగి నీడి వెంకటేశ్వరరావు, కొర్లపాటి వెంకటేశ్వరరావు, కామిశెట్టి సాయిబాబు, బండారు శీను, కోటిపల్లి శ్రీను గారు తదితరులు పాల్గొన్నారు.